బాల నటులుగా వెండితెర మీద సందడి చేసిన చాలా మంది స్టార్స్ తరువాత లీడ్‌ రోల్స్‌లోనూ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే బాలనటులుగా ఆకట్టుకొని లీడ్‌ రోల్స్‌లో సక్సెస్‌ అయిన వారు చాలా తక్కువ మందే ఉన్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో ముద్దుగుమ్మ వచ్చి చేరింది. 2014లో వెంకటేష్‌ హీరోగా తెరకెక్కిన క్రైమ్‌ థ్రిల్లర్ మూవీ దృశ్యం సినిమాలో బాలనటి అనుగా ఆకట్టుకుంది ఎస్తర్‌ అనిల్‌. తన ముద్దు ముద్దు మాటలతో క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆ సినిమాలో ఆకట్టుకుంది.

తాజాగా ఈ భామ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. దృశ్యం తరువాత మలయాళంలో పలు చిత్రాల్లో నటించిన ఎస్తర్‌ అక్కడ ఉత్తమ వర్థమాన నటిగా కేరళ ఫిలిం క్రిటిక్స్‌ అసోషియేషన్‌ అవార్డును సైతం అందుకుంది. మోహన్‌ లాల్ నటించిన దృశ్యం సినిమాలోనూ ఎస్తరే ఆ పాత్రలో నటించింది. ఆ సినిమాలో చాలా క్యూట్‌గా కనిపించిన ఈ చిన్నారి ఇప్పుడు అందంగా తయారైంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ గ్లామర్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది.

ఇప్పుడు తెలుగు సినిమా జోహార్ ద్వారా హీరోయిన్‌గా పరిచయం అవుతోంది ఎస్తర్‌. తేజ మర్ని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ధర్మ సూర్య పిక్చర్స్‌ బ్యానర్‌పై సందీప్‌ మర్ని నిర్మిస్తున్నాడు. అంకిత్ కొయ్య, నైనా గంగూలీ, ఎస్తర్‌ అనిల్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రియ దర్శన్‌ బాలసుబ్రమణియన్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు జగదీశ్ చీకటి సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.