హీరో విక్టరీ వెంకటేష్‌ పెద్ద కూతురి వివాహం జైపూర్‌లో ఆదివారం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఆశ్రిత, వినాయక్‌లు పెళ్లి వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పటికే ఈ  పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను మెగా కోడలు ఉపాసన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. 

ఇక తన కుమార్తె ఆశ్రిత పెళ్లి వేడుక సందర్భంగా జరిగిన సంగీత్ కార్యక్రమంలో విక్టరీ వెంకటేష్ ఓ రేంజిలో హంగామా చేసారు. ఆయన క్లోజ్ ప్రెండ్, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఈ వేడుకలో రచ్చ రచ్చ చేసారు. ఓ బాలీవుడ్ సినిమాలోని పాట మ్యూజిక్ కి అనుగుణంగా ఇద్దరూ కలిసి స్టెప్పులేసి ఇరగదీశారు.మీరు ఇక్కడ ఆ వీడియోని చూడవచ్చు.

 

రానా కూడా వారిని ఎంకరేజ్ చేస్తూ తానూ డ్యాన్స్ చేశాననిపించాడు. ఇక నాగచైతన్య, రాం చరణ్ తమ భార్యలతో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు. మూడు రోజులపాటు జరిగిన ఆశ్రిత, వినాయక్ ల పెళ్లి వేడుకలు ఆదివారంతో ముగిశాయి. 

వధూవరులతో పాటు వెంకటేష్‌ దంపతులతో కలిసి చరణ్ ఉపాసన దిగిన ఫోటో, చరణ్ బెస్ట్ ఫ్రెండ్‌ యంగ్ హీరో రానా తో కలిసి దిగిన ఫోటోలను ఉపాసన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డి, ఆశ్రీతలు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు పెద్దల అంగీకారంతో ఈ ఇద్దరు ఒక్కటయ్యారు. 

పెళ్లి వేడుకను అత్యంత సన్నిహితుల మధ్యే నిర్వహించిన దగ్గుబాటి ఫ్యామిలీ సినీ ప్రముఖుల కోసం త్వరలో హైదరాబాద్‌లో గ్రాండ్‌ రిసెప‍్షన్‌ ఇవ్వనుందని తెలుస్తోంది.