హీరోయిన్ అంజల జవేరి ఓ ఫేమస్ విలన్ వైఫ్. వెండితెరకు దూరమైన ఒకప్పటి ఈ స్టార్ హీరోయిన్ గురించి అభిమానులకు తెలిసింది తక్కువే.
చేసింది తక్కువ చిత్రాలే అయినా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది అంజల జవేరి. లండన్ లో పుట్టిన అంజల జవేరి మోడలింగ్ చేశారు. 1997లో హిమాలయ పుత్ర అనే హిందీ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆమె సెకండ్ మూవీ ప్రేమించుకుందాం రా. వెంకటేష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. హోమ్లీ లుక్ కి తోడు అద్భుతమై పాత్రలో అంజల జవేరి యువత గుండెలు కొల్లగొట్టారు. ప్రేమించుకుందాం రా అంజల జవేరికి విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది.
అనంతరం చిరంజీవికి జంటగా నటించిన చూడాలని వుంది సూపర్ హిట్ కాగా... సమరసింహారెడ్డి చిత్రంలో ఇండస్ట్రీ హిట్ అందుకుంది. రావోయి చందమామ, దేవీ పుత్రుడు, భలేవాడివి బాసూ... ఇలా వరుసగా స్టార్స్ తో జతకట్టారు. అయితే అంజల జవేరి కెరీర్ గ్రాఫ్ చాలా త్వరగా పడిపోయింది. 2005 వరకు హీరోయిన్ గా పలు భాషల్లో నటించారు. అంజల జవేరి చివరి చిత్రం 2012లో విడుదలైన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. దర్శకుడు శేఖర్ కమ్ముల ఆమెకు ఒక చిన్న పాత్ర ఇచ్చారు.
పెళ్లి తర్వాత సిల్వర్ స్క్రీన్ కి దూరమైన అంజల జవేరి గురించి ప్రేక్షకులకు తెలిసింది చాలా తక్కువ. కారణం ఆమె సోషల్ మీడియా వాడరు. ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్న దాఖలాలు కూడా లేవు. కాగా అంజల జవేరి యాక్టర్ అండ్ మోడల్ తరుణ్ అరోరాను ప్రేమ వివాహం చేసుకున్నారు. అనేక తెలుగు చిత్రాల్లో విలన్ గా నటించిన తరుణ్ అరోరా... అంజలా జవేరి భర్త అన్న విషయం చాలా తెలియదు.
ఖైదీ నెంబర్ 150 చిత్రంతో తరుణ్ అరోరా తెలుగులో అడుగుపెట్టారు. చిరంజీవి కమ్ బ్యాక్ మూవీగా తెరకెక్కిన ఖైదీ 150లో ఆయన మెయిన్ విలన్ రోల్ చేశారు. అనంతరం వరుసగా జయ జానకి నాయక, అర్జున్ సురవరం, అమర్ అక్బర్ ఆంటోని చిత్రాల్లో విలన్ రోల్స్ చేశారు. ఆయన లేటెస్ట్ మూవీ పక్కా కమర్షియల్. గోపీచంద్ హీరోగా నటించారు. పక్కా కమర్షియల్ మూవీ గత ఏడాది విడుదలైంది.
