Asianet News TeluguAsianet News Telugu

'వెంకీ మామ' లో వెంకటేష్ పాత్ర ఇదే..

నిజ జీవిత మామా..మేనళ్లుడు అయిన వెంకటేష్, నాగచైతన్య తెరమీద కూడా అవే పాత్రలు పోషించబోతున్నారు.  వీరిద్దరి  కాంబోలో మూవీ కోసం అక్కినేని, దగ్గుబాటి అభిమానులు ఎప్పటినుండో వేచి చూస్తున్నారు.

Venkatesh as villager in Venky Mama
Author
Hyderabad, First Published Feb 16, 2019, 12:10 PM IST

నిజ జీవిత మామా..మేనళ్లుడు అయిన వెంకటేష్, నాగచైతన్య తెరమీద కూడా అవే పాత్రలు పోషించబోతున్నారు.  వీరిద్దరి  కాంబోలో మూవీ కోసం అక్కినేని, దగ్గుబాటి అభిమానులు ఎప్పటినుండో వేచి చూస్తున్నారు. కానీ మంచి కథ దొరక్క వారు ఇన్నాళ్లు కలిసి సినిమా చేయలేకపోయారు.  ఇన్నాళ్లకు సురేష్ ప్రొడక్షన్ లో జై లవ కుశ దర్శకుడు బాబీ డైరెక్షన్ లో వెంకటేష్, నాగ చైతన్య ఒక మీడియం బడ్జెట్ మల్టీస్టారర్ కి శ్రీకారం చుట్టారు. ఈ సినిమాని సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్ లోనే నిర్మిస్తున్నారు.  

ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర టిపికల్ పల్లెటూరి మనిషి పాత్ర అని తెలుస్తోంది. అనుబంధాలకు,ఆత్మీయలకు,మర్యాదలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటాడని అమాయకత్వంతో కూడిన ఆ పాత్ర దృశ్యం సినిమాలో వెంకటేష్ ని గుర్తు చేస్తుందంటున్నారు.

ఇక పల్లెటూరు లొకేషన్స్ కోసం రాజమండ్రి చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతున్నారు. రీసెంట్ ఎఫ్ 2 హిట్ కావటంతో ఆ ఊపులో మరో కామెడీ చేస్తున్నట్లు సమాచారం. చిన్నప్పుడే విడిపోయిన తన మేనల్లుడుని వెతుక్కుంటూ సిటీకు వచ్చే పాత్రలో వెంకటేష్ కనపడతాడని, అయితే అతనే తన మేనల్లుడు అని తెలియక ఇద్దరూ  పరిచయమైనా ఎవరో అన్నట్లు బిహేవ్ చేస్తారని చెప్తున్నారు. అందులోంచి పుట్టే ఫన్ ఫస్టాఫ్ ని హిలేరియస్ గా మారుస్తుందని చెప్తున్నారు. 

ఇక సెకండాఫ్ లో నాగచైతన్యను తమ గ్రామానికి తీసుకు వస్తాడని ...అక్కడ విలేజ్  లో పాత్రలతో నాగచైతన్య చేసే కామెడీ నవ్విస్తుందని చెప్తున్నారు. రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో వెంకికు, నాగచైతన్యకు ఇద్దరికి సమానమైన ప్రాధాన్యత ఉంటుందంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios