Asianet News TeluguAsianet News Telugu

త్రివిక్రమ్ తో సినిమా ఇప్పట్లే లేనట్లే

వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చే సినిమాపై సర్వత్రా ఆశక్తి నెలకొంది.  అయితే ఆ ప్రాజెక్టు ఇంక లేనట్లే అని తెలుస్తోంది. గతంలోనూ అలాగే  వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కబోతున్నట్టు అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది కానీ అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడూ అంతే జరుగుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. 

Venkatesh and Trivikram Srinivas movie may not happen?  jsp
Author
Hyderabad, First Published Jul 18, 2021, 9:53 AM IST

విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ వీరి కాంబోలో వచ్చిన 'మల్లీశ్వరి', 'నువ్వు నాకు నచ్చావ్' లాంటి సినిమాలకు పనిచేసింది తెలిసిందే. మాటల మంత్రికుడు త్రివిక్రమ్ దర్శకుడిగా మారిన వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. కానీ  ఆ మధ్యన వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నారని వార్తలు వచ్చాయి. వెంకటేష్.. నారప్ప 72వ సినిమా.. 'దృశ్యం 2' 73వ మూవీ.. 'ఎఫ్ 3' 74 చిత్రం. అందుకే తన లాండ్ మార్క్ మూవీ 75వ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాలని ఫిక్స్ అయ్యినట్లు చెప్పుకున్నారు.  దాంతో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చే సినిమాపై సర్వత్రా ఆశక్తి నెలకొంది.  అయితే ఆ ప్రాజెక్టు ఇంక లేనట్లే అని తెలుస్తోంది. 

గతంలోనూ అలాగే  వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కబోతున్నట్టు అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది కానీ అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడూ అంతే జరుగుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.  ఇప్పటికే వెంకటేష్.. త్రివిక్రమ్‌తో 'జాలీ ఎల్‌ఎల్‌బీ 2' సినిమా రీమేక్ చేయాలనుకున్నారు. ఎందుకో వర్కౌట్ కాలేదు. మరోవైపు వెంకటేష్.. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'అజ్ఞాతవాసి'లో కాసేపు అతిథి పాత్రలో మెరిసారు. ఈ సన్నివేశాన్ని ఆ తర్వాత యాడ్ చేసిన సంగతి తెలిసిందే కదా.  
 
అంతేకాదు వెంకటేష్ ఆ సినిమా  గురించి మాట్లాడేందుకు పెద్దగా ఇంట్రస్ట్ చూపడం లేదు. ‘నారప్ప’ సినిమా మీడియా ప్రొమోషన్ లో భాగంగా తరుణ్ భాస్కర్ మూవీ, త్రివిక్రమ్ మూవీ గురించి అడిగితే, “ఏది మన చేతిలో లేదమ్మా” అని  చెప్పారు. తరుణ్ భాస్కర్ ఇంకా ఏదో రాస్తున్నాడని చెప్పిన వెంకటేష్.. త్రివిక్రమ్ గురించి పెద్దగా చర్చించేందుకు ఆసక్తి చూపలేదు. మరో ప్రక్క త్రివిక్రమ్ కూడా వరస ప్రాజెక్టులు ప్లాన్ చేసుకుంటున్నారు. మహేష్ బాబుతో నెక్స్ట్ మూవీ మొదలు పెడుతారు. ఆ తర్వాత రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఉంటే అవకాసం ఉంది.

 ప్రస్తుతం వెంకటేష్.. 'నారప్ప'తో పాటు 'దృశ్యం 2' సినిమాలు  పూర్తి చేశారు. అంతా బాగుంటే ఇప్పటికే థియోటర్ లో 'నారప్ప' సినిమా విడుదలై ఉండేది. ఇప్పుడు ఓటీటీలో వచ్చేస్తోంది. మరోవైపు వెంకటేష్.. మలయాళంలో హిట్టైన 'డ్రైవింగ్ లైసెన్స్' సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేశారు  దాంతో 'డ్రైవింగ్ లైసెన్స్' మూవీ రీమేకా.. లేకపోతే.. హిందీలో హిట్టైన 'జాలీ ఎల్‌ఎల్‌బీ 2' రీమేక్ వైపో వెళ్లిపోతాడని తెలుస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios