ఫిబ్రవరి 9న థియేటర్ల రిలీజ్.. 10న OTTలో ,ఇదేం ట్విస్ట్?
మన తెలుగు చిత్ర సీమకు చెందిన హీరోలు ఇతర భాషల్లో తమ సినిమాలను రిలీజ్ చేసి మార్కెట్‌ని పెంచుకుంటున్నారు.

సాధారణంగా సినిమా రిలీజ్ అయ్యిన నెల రోజులుకు ఓటిటిలో విడుదల చేస్తూంటారు. కానీ రిలీజ్ అయిన మరుసటి రోజే ఓటిటి రిలీజ్ ఉంటే ఆశ్చర్యమే కదా..అదే ఇప్పుడు జరగబోతోంది. వివరాల్లోకి వెళితే...
కన్నడ చలనచిత్ర పరిశ్రమలో శివ రాజ్‌కుమార్ ఒక ఐకానిక్ హీరో.ప్రస్తుతం శివ రాజ్‌కుమార్ చేసిన చిత్రం వేద. వేద చిత్రం శివ రాజ్‌కుమార్ కి చాలా ప్రత్యేకమైన చిత్రం. ఇది అతని 125 చిత్రాల మైలురాయిని గుర్తించడమే కాకుండా, అతని భార్య గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ అయిన అతని హోమ్ బ్యానర్‌లో ఇది మొదటి వెంచర్‌గా కూడా రావడం విశేషం. ఇటీవలే కన్నడలో విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న గురువారం తెలుగులో రిలీజ్ కు సిద్దమవుతుంది. మాములుగా ఇండస్ట్రీలో సినిమాలు శుక్రవారం రిలీజ్ అవుతుంటాయి. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాను ఒకరోజు ముందుగానే రిలీజ్ చేస్తున్నారు .కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. అంతవరకూ బాగానే ఉంది. ఈ సినిమా కన్నడ వెర్షన్ జీ 5 ఓటిటిలో పిబ్రవరి 10న రిలీజ్ అవుతోంది. అందుకు కారణం ...
ఎ. హర్ష దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా చిత్రం కన్నడలో ఆల్రెడీ రిలీజైంది. అక్కడ డిసెంబర్ 23న విడుదలై సంచలనం సృష్టించగా ఈ సినిమాలో ఘనవి లక్ష్మణ్, అదితి సాగర్, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ మరియు అనేక మంది నటించారు. ఫిబ్రవరి 9న విడుదలకు సన్నాహాలు చేస్తోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఫిబ్రవరి 7న జరగగా నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అయితే శివ రాజ్‌కుమార్ తదుపరి చిత్రం, పాన్-ఇండియా సినిమాగా చెబుతున్న ది ఘోస్ట్ కోసం ఇక్కడ తెలుగులో రిలీజ్ చేయటానికి బజ్ క్రియేట్ చేయటానికి ప్రమోషన్ ప్లాన్ అంటున్నారు.
మన తెలుగు చిత్ర సీమకు చెందిన హీరోలు ఇతర భాషల్లో తమ సినిమాలను రిలీజ్ చేసి మార్కెట్‌ని పెంచుకుంటున్నారు. అలాగే ఇతర భాషల్లోని హీరోలు టాలీవుడ్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే శివ రాజ్ కుమార్ వేద సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది.