Asianet News TeluguAsianet News Telugu

Ennenno Janmala Bandham: భర్తను కాళ్ళు పట్టుకునేలా చేసిన వేద.. యష్ కి క్లాస్ పీకిన వసంత్?

Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మంచి కథ బలంతో ఎంతో ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. భార్యాభర్తల బంధానికి ప్రతీకగా ఉన్న ఈ సీరియల్ అందరి హృదయాలని దోచుకుంటుంది. ఇక ఈరోజు మార్చి 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

Vedaswini feels happy after sharing a moment with Yash in todays Ennenno Janmala Bandham serial gnr
Author
First Published Mar 17, 2023, 10:06 AM IST

ఎపిసోడ్ ప్రారంభంలో తన పెళ్లినాటి సంగతులని తలుచుకొని ఆనందపడుతుంది వేద. తనని తాను చెక్ చేసుకుంటూ హార్ట్ బీట్ పల్స్ నార్మల్గానే ఉన్నాయి  అనుకుంటుంది. అమ్మ ఎంత బాగా గుర్తు చేసింది ఇప్పుడు నేను ఖుషి కి తల్లిని మాత్రమే కాదు ఆయనకి భార్యని కూడా. మా ఇద్దరి మధ్య ఒక దోబూచులాట ఉంది అది కూడా ఎంతో బాగుంది.

ఇదే కదా భార్యాభర్తల బంధం అంటే, ఇక నా మనసులో వేరే ఆలోచనలే వద్దు నా మనసు నిండా మా శ్రీవారే అనుకుంటూ టెడ్డితో కలిసి డాన్స్ చేస్తుంది. శ్రీవారు ఏమైపోయారు మీకోసం ఇక్కడ మీ శ్రీమతి ఎదురుచూస్తుంది త్వరగా వచ్చేయండి అంటూ టెడ్డితో చెప్తుంది. మరోవైపు యష్ ఆఫీస్ కి మల్టీ నేషనల్ కంపెనీస్ కి రిప్రెసెంటేటివ్ వస్తారు.

వాళ్లని రిసీవ్ చేసుకుని మీతో పాటు మహేష్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా పాటిస్పేట్ చేయడానికి అవకాశం దొరికినందుకు ఆనందంగా ఉంది అంటాడు యష్. మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తున్నందుకు సారీ, మీలాంటి చిన్న కంపెనీలలో పెట్టుబడులు పెట్టడానికి మేము ఇంట్రెస్ట్ చూపించడం లేదు అంటారు వాళ్ళు. ఇది చిన్న కంపెనీ కానీ ఎదుగుతున్న కంపెనీ.

భూముల మీద పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు అబిడ్స్ లో కొనరు,హైదరాబాద్ ఔట్స్కట్స్ లో కొంటారు రెండు మూడేళ్ల తర్వాత అది పెరుగుతుందని నమ్మకం, అదే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. ఎంకరేజ్ స్మాల్ కంపెనీస్ బట్ గ్రోయింగ్ కంపెనీస్ లైక్ అస్ అంటాడు యష్. ఆ మాటలకి ఇంప్రెస్ అయ్యి వాళ్ల బిజినెస్ లో పార్ట్నర్ షిప్ ఇస్తారు ఆ రిప్రజెంటేటివ్స్.

ఎందుకు ఎంతో సంతోషిస్తారు యష్, వసంత్. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత ఇద్దరు ఒకరికి ఒకరు కంగ్రాట్స్ చెప్పుకుంటారు. వాళ్లు మన కంపెనీని చిన్న కంపెనీ అంటూ అవమానించారు కానీ నువ్వు కంగారు పడకుండా వాళ్లని కన్వే చేయగలిగావు ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ, బ్రాడ్ నెస్ ఎందుకు నువ్వు లైఫ్ లో చూపించలేకపోతున్నావు అంటాడు వసంత్.

ఇంకా స్ట్రెయిట్ గా చెప్పాలంటే వేద వదిన విషయంలో ఎందుకు మొండిగా ప్రవర్తిస్తావు. బిజినెస్ లోనే కాదు మ్యారీడ్ లైఫ్ లో కూడా గివ్ ఎండ్టేక్ ఉండాలి ఈరోజు నీకు హ్యాపీ డే రేపు ఇంకా హ్యాపీ డే, ఎందుకంటే రేపు నీ ఫస్ట్ యానివర్సరీ డే  అంటాడు వసంత్. వదినతో సంతోష్ వదినతో హ్యాపీగా ఉంటే చాలా సంతోషంగా ఉంటావు కొంచెం గ్యాప్ వచ్చేసరికి డిసప్పాయింట్ అయిపోతావు.

బీ హ్యాపీ, హ్యాపీగా వదినతో పెళ్లిరోజు సెలబ్రేట్ చేసుకో అంటూ నవ్వుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు వసంత్. అప్పుడే పెళ్లయి వన్ ఇయర్ అయిపోయింది ఇన్నాళ్ళు తనని ఎలా భరించానో ఏంటో అనుకుంటూ ఎనీవే పండితారాద్యుల వేదాశ్విని గారు హ్యాపీ వెడ్డింగ్ అనివర్సరీ అనుకుంటాడు. మరోవైపు ఇంటికి వచ్చిన యష్ ని చూసి సిగ్గు పడిపోతుంది వేద.

జారిపోయిన తన కాలి మెట్టెని పెట్టుకుందామనుకుంటుంది కానీ పెట్టుకోలేకపోతుంది. యష్ హెల్ప్ చేస్తాడు. పని అయిన తర్వాత యష్ వెళ్ళిపోతుంటే అతన్ని ఆపి చేతులు పాదాలను పట్టుకుంటే దండం పెట్టుకోవాలంట అమ్మ చెప్పింది అంటూ యష్ చేతులకి దండం పెడుతుంది వేద. నవ్వుతూ వెళ్ళిపోతాడు యష్. ఈ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలి మీ శ్రీమతికి మీరు కొంచెం కొంచెం నచ్చేస్తున్నారు అంటూ తెగ ఆనంద పడిపోతుంది వేద.

మరోవైపు వసంత్ ఇంటికి వస్తుంది చిత్ర. మాళవిక తలుపులు తీసి ఆమెని ఆహ్వానిస్తుంది నేను వసంత్ కోసం వచ్చాను అంటుంది ఇప్పుడే బయటికి వెళ్ళాడు అంటుంది మాళవిక. అయితే తనకి నేను ఫోన్ చేసి మాట్లాడుతాను అని వెళ్ళిపోతుంటే నాతో మాట్లాడవా అంటూ సోఫాలో కూర్చోబెట్టి జ్యూస్ ఇస్తుంది మాళవిక. మీకు ఒకటి చూపించాలి అంటూ ఇయర్ రింగ్స్ చూపిస్తుంది మాళవిక.

చాలా బాగున్నాయి వసంత గిఫ్ట్ ఇచ్చాడా అంటుంది చిత్ర. కాదు అభి డార్లింగ్ ఇచ్చాడు అంటుంది  మాళవిక. అంటే ఆ డైమండ్ నెక్లెస్ వేరే ఎవరికో ఇచ్చి ఇయర్ రింగ్స్ తో సరి పెట్టేసాడు ఆ నీచుడు. నేను రావడం మంచిదేంది ఇప్పుడే అభి గురించి మాళవికకి చెప్పేస్తాను అనుకుంటూ తను నోరు విప్పే లోపు అభికి నేనంటే ఎంత ఇష్టమో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నాడు ఎగ్జైటింగ్ గా చెప్తుంది మాళవిక.

నేను మీతో మాట్లాడాలి అని చిత్ర అంటే నేను కూడా నీతో మాట్లాడాలి నేను వసంత్ కి సిస్టర్ ని నువ్వు వసంత్ కి కాబోయే భార్య మనిద్దరి మధ్య కూడా హెల్తీ రిలేషన్ ఉండాలి అందుకే చలవ తీసుకొని నీతో కొన్ని విషయాలు మాట్లాడతాను ఏమీ అనుకోవు కదా అంటుంది మాళవిక. తప్పకుండా మాట్లాడొచ్చు మాళవిక అంటుంది చిత్ర. పెళ్లి విషయంలో కుట్ర జరుగుతుంది.

అభి నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు అని తెలిసి చాలామంది కుళ్ళుకుంటున్నారు. అందుకే అభి గురించి నా దగ్గర ఎవరేం చెప్పినా వినదల్చుకోలేదు మాళవిక. నేను మీకు చెప్పే అంతటి దాన్ని కాదు. ఒక ఆడదానికి జీవితంలో ముఖ్యమైన వాడు భర్త అలాంటి భర్త విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి ఇవన్నీ మీకు తెలియనివి కాదు అంటుంది చిత్ర.

అభి తో పెళ్లి అయ్యేవరకు టెన్షన్ గా ఉంటుంది ఆ టెన్షన్లోనే ఏదైనా మాట్లాడేసాను ఏమీ అనుకోవద్దు అంటుంది మాళవిక. ఇట్స్ ఓకే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చిత్ర. బయటికి వచ్చిన తర్వాత ఎంత అమాయకురాలివి ఇంత గుడ్డిగా నమ్ముతున్నావు కాబట్టే ఆ అభిమన్యు బరితెగించి బయట తిరుగుళ్ళు తిరుగుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తిరుగుబోతు నుంచి నిన్ను కాపాడుతాను.

ఎదురులేని సాక్ష్యం సంపాదించి వాడు ఎలాంటివాడు నిరూపిస్తాను  అనుకుంటుంది చిత్ర. మరోవైపు వేదకి మ్యారేజ్ యానివర్సరీ విషెస్ చెప్తుంది ఖుషి. మ్యారేజ్ యానివర్సరీ మాత్రమే కాదు మదర్ అనివర్సరీ కూడా  అంటూ ఖుషిని హగ్ చేసుకుంటుంది. నేను అమ్మని అయిన రోజు . నీతో అమ్మ అని పిలిపించుకున్న రోజు అంటూ ఖుషిని తనివి తీరా ముద్దు చేస్తుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Follow Us:
Download App:
  • android
  • ios