భావితరాలను కాలుష్య కోరల నుంచి కాపాడుకోవాలన్న ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల జరిగే నష్టాల గురించి చర్చించారు.

 యంగ్‌ హీరో వరుణ్‌ తేజ్‌ (Varun Tej) నటించిన కొత్త చిత్రం ‘గాండీవధారి అర్జున’ (Gaandeevadhari Arjuna).ఈ రోజున ఆగస్టు 25న విడుదల అయ్యింది. ఈ సినిమాపై చాలా ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నాడీ హీరో. తన కెరీర్లో ఇది ఓ ప్రత్యేకమైన సినిమా అంటున్న వరుణ్.. ఈ చిత్రం తనలో వ్యక్తిగతంగా కూడా చాలా మార్పు తెచ్చిందని.. బాధ్యత పెంచిందని చెబుతున్నాడు. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే వారిలో ఆలోచన రేకెత్తించే సినిమా ఇదని అతనన్నాడు. ఇక ఇప్పటికే యుఎస్ లో ప్రీమియర్స్ పడిపోయాయి. దాంతో చిత్రం టాక్ బయిటకు వచ్చింది. 

US టాక్ ప్రకారం ఈ సినిమా వరుణ్ తేజ్ అభిమానులను మరోసారి నిరాశపరిచింది. ‘గరుడవేగ’ ఫేమ్ ప్రవీణ్ సత్తారు రూపొందించిన ఈ చిత్రంలో ఎక్కడా ఎంగేజింగ్ డ్రామా లేదు. అలాగే ఇలాంటి సినిమాకు అవసరమైన థ్రిల్స్ కూడా చాలా మైల్డ్ గా ఉన్నాయి. స్టైలిష్ యాక్షన్ చూపటంపై దృష్టి పెట్టిన దర్శకుడు సోషల్ ఇష్యూని డీల్ చేయటంలో ఇబ్బంది పడ్డాడు అని చెప్తున్నారు. అలాగే యాక్షన్ థ్రిల్లరే కానీ వర్కవుట్ కాలేదని చెప్తున్నారు. ఇక సినిమాలో చాలా సీన్స్ క్లీషే గా ఉండటం, ప్రారంభం నుంచి ప్లాట్ నేరేషన్ , ఎక్కడా హై లు లేకపోవటంతో అనుకున్న స్దాయిలో లేదని చెప్తున్నారు., సినిమాలో కెమెరా వర్క్ మాత్రం అదిరిపోయిందని అంటున్నారు. వరుణ్ తేజ కూడా చాలా బాగా చేసాడని, కాకపోతే కథ సరిగ్గా లేకపోవటంతో కలిసి రాలేదని అంటున్నారు. అయితే ఇదంతా కేవలం వినిపిస్తున్న టాక్ మాత్రమే. అసలు రిజల్ట్ ఏమిటనేది మరికొద్ది గంటల్లో తెలుస్తుంది. 

భావితరాలను కాలుష్య కోరల నుంచి కాపాడుకోవాలన్న ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల జరిగే నష్టాల గురించి చర్చించారు. ‘‘ఇంద్రుడు వరంగా ఇచ్చిన ధనుస్సు (గాండీవం)తో అర్జునుడు కురుక్షేత్ర యుద్ధం చేస్తాడు. ఆ ఆయుధం పట్టుకున్న సమయంలో అర్జునుడు ఎంత భయంకరంగా ఉంటాడో ఈ సినిమాలో ‘ఎమ్‌4 కార్బైన్‌’ (గన్‌) పట్టుకున్న హీరో అలానే కనిపిస్తాడు. అందుకే ఈ చిత్రానికి ‘గాండీవధారి అర్జున’ పేరు పెట్టాం’’ అని దర్శకుడు వివరించారు. 

 వరుణ్ తేజ మాట్లాడుతూ..‘‘గాండీవధారి అర్జున సినిమాలో మేం ఒక మంచి సందేశం ఇస్తున్నాం. అలా అని మీరు మారండని మేం చెప్పడం లేదు. ఒక సమస్యను ఆలోచన రేకెత్తించేలా చూపించాం. అది చూశాక మనలో ఎలాంటి మార్పు అవసరం అనేది ఎవరికి వాళ్లే నిర్ణయించుకుంటారు. దర్శకుడు ఈ కథ చెప్పినప్పటి నుంచి స్వతహాగా నాలో చాలా మార్పులొచ్చాయి. ప్లాస్టిక్ వినియోగం తగ్గించా. సెట్లో కూడా ఏది పడితే అది వాడి పడేయకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. మంచి సినిమాలు చేయాలి, కుటుంబాన్ని బాగా చూసుకోవాలనే ధ్యాసలో చుట్టూ ఏం జరుగుతుందో కొన్నిసార్లు పట్టించుకునేవాడిని కాదు.

 కానీ గమనిస్తే ఇప్పటికే మనకు సరైన సమయంలో వర్షాలు పడటం లేదు. ఎండలు పెరిగిపోయాయి. ఇష్టానుసారంగా ప్లాస్టిక్ వస్తువులు కొని వాడేస్తున్నాం. ఆ ప్లాస్టిక్ ఎక్కడికి పోతుందో ఆలోచించడం లేదు. కమర్షియల్ అంశాలతో పాటే ఈ విషయాలన్నీ సినిమా చర్చిస్తుంది. ఇందులో నేను చేస్తున్నది ఏజెంట్ పాత్ర కాదు. నేనొక బాడీ గార్డ్. నాది అర్జునుడి తరహా పాత్ర అయితే.. నాజర్ నన్ను నడిపించే శ్రీకృష్ణుడి తరహా క్యారెక్టర్లో కనిపిస్తారు’’ అని వరుణ్ తెలిపాడు. 

ప్రముఖులకు బాడీగార్డ్‌లను నియమించే ESSAY అనే సంస్థలో ఓ సభ్యుడిగా కనిపిస్తారు వరుణ్‌తేజ్‌. సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌ అర్జున్‌గా తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించనున్నారు. ‘ఏజెంట్‌’ తర్వాత హీరోయిన్‌ సాక్షి వైద్య (Sakshi Vaidya) నటించిన చిత్రమిది. ఇందులో ఆమె ఐఏఎస్‌ అధికారి ఐరా పాత్ర పోషించారు. నాజర్‌, వినయ్‌ రాయ్‌, విమలా రామన్‌, రోషిణి ప్రకాశ్‌, నరేన్‌ తదితరులు కీలక పాత్రధారులు.