మెగా యువ హీరో వరుణ్ తేజ్ నుంచి రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ వాల్మీకి. ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలు రేపుతున్న వరుణ్ స్ట్రాంగ్ ఓపెనింగ్స్ అందుకునేలా కనిపిస్తున్నాడు. తమిళ్ మూవీ జిగర్తాండకి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఇకపోతే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా స్ట్రాంగ్ ఉన్నట్లు తెలుస్తోంది. 

టీజర్ ట్రైలర్ తో పాటు విడుదలైన కొన్ని సాంగ్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ తో వరుణ్ తేజ్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసేలా ఉన్నాడని టాక్. ఇక సినిమా డిజిటల్ శాటిలైట్ పరంగా కూడా మంది లాభాలను అందించింది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ తెలుగు ఛానెల్ స్టార్ మా సినిమా శాటిలైట్ రైట్స్ ని దక్కించుకున్నట్లు సమాచారం. 

డిజిటల్ శాటిలైట్ పరంగా సినిమా 10కోట్ల వరకు లాభాల్ని అందించినట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ కెరీర్ లో వాల్మీకి  సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు. ఇక సినిమాలో పూజా హెడ్జ్ హీరోయిన్ గా నటిస్తుండగా అథర్వ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కోలీవుడ్ లో కలెక్షన్స్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన ఈ కథ తెలుగులో ఎలాంటి గ్రాస్ కలెక్షన్స్ ని రాబడుతుందో చూడాలి.