మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'గాండీవధారి అర్జున' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే వరుణ్ తేజ్ మరో మూవీ షూటింగ్ ప్రారంభించాడు. 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'గాండీవధారి అర్జున' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ప్రవీణ్ సత్తారు స్టైల్ లో యాక్షన్ మూవీగా తెరకెక్కుతోంది. అలాగని ఇది రొటీన్ చిత్రం కాదు. సరికొత్త కథాంశంతో వరుణ్ ఈ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే వరుణ్ తేజ్ మరో మూవీ షూటింగ్ ప్రారంభించాడు. 

శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఇటీవల ఓ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆల్రెడీ ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా ఫినిష్ చేశారు. సోని పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కొన్ని వేస్తావ సంఘటనల ఆధారంగా శక్తి ప్రతాప్ సింగ్ ఈ చిత్ర కథని రూపొందించారు. గగనతలంలో ఒళ్ళు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలతో.. యుద్ధ విమానాల విన్యాసాలతో ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

తాజాగా ఈ చిత్ర యూనిట్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీలో మాజీ ప్రపంచ సుందరి, నటి మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు ప్రకటించారు. మానుషీ చిల్లర్ 2017లో మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నాజూకు అందాల భామకి సినిమా అవకాశాలు అంతగా రావడం లేదు. అక్షయ్ కుమార్ సరసన నటించిన సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టి అమ్మడి ఆశలపై నీళ్లు చల్లింది. 

Scroll to load tweet…

ఇప్పుడు సౌత్ లో వరుణ్ తేజ్ చిత్రం రూపములో మానుషీ చిల్లర్ కి అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో మానుషీ రాడార్ ఆఫీసర్ గా నటిస్తోంది. ఆమెకి వెల్ కమ్ చెబుతూ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. మానుషీ లాంటి నాజూకు భామతో వరుణ్ తేజ్ రొమాన్స్ కి రెడీ అవుతుండడంతో ఫ్యాన్స్ లో ఆసక్తి పెరుగుతోంది.