మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన కామెడీ ఎంటర్టైనర్ ఎఫ్ 3 చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఎఫ్ 3 చిత్రం ఇప్పటికే మంచి టాక్ సొంతం చేసుకుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన కామెడీ ఎంటర్టైనర్ ఎఫ్ 3 చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఎఫ్ 3 చిత్రం ఇప్పటికే మంచి టాక్ సొంతం చేసుకుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్ కలిసి ఈ చిత్రంలో నటించారు. ఎఫ్ 2 తరహాలోనే ప్రేక్షకులు మంచి వినోదాన్ని అందించేందుకు రెడీ అయ్యారు.
ఇదిలా ఉండగా ఎఫ్ 3 ప్రచార కార్యక్రమాల్లో వరుణ్ తేజ్ తన నెక్స్ట్ మూవీ గురించి ఇంటరెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు. వరుణ్ తేజ్ తన నెక్స్ట్ మూవీ కోసం గరుడ వేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటించబోతున్నట్లు తెలిపాడు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉండబోతోందని వరుణ్ తేజ్ అనౌన్స్ చేశాడు.
ప్రవీణ్ సత్తారు ప్రతిభ ఉన్న దర్శకుడు. గరుడ వేగ లాంటి సీరియస్ యాక్షన్ డ్రామాని అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు కింగ్ నాగార్జునతో ఘోస్ట్ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ కంప్లీట్ కాగానే వరుణ్ తేజ్ మూవీ సెట్స్ పైకి వెళుతుంది. ఈ చిత్రం ఎక్కువ భాగం లండన్ లోనే షూటింగ్ జరుగుతుందని వరుణ్ తెలిపాడు.
వరుణ్ తేజ్ యాక్షన్ మూవీని ఎంచుకుని సాహసం చేస్తున్నాడనే చెప్పాలి. వరుణ్ తేజ్ కి యాక్షన్ చిత్రాలు అంతగా కలసి రావడం లేదు. వరుణ్ చివరగా నటించిన గని బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం చెందింది .
వరుణ్ తేజ్ కి ఎక్కువగా ప్రేమ కథ, కామెడీ, ఫీల్ గుడ్ చిత్రాలతోనే విజయాలు దక్కాయి. ఫిదా, తొలిప్రేమ, ఎఫ్2 ఆ కోవకు చెందినవే. అంతరిక్షం ప్రయోగాత్మక చిత్రంగా మిగిలిపోయింది కానీ బాక్సాఫీస్ వద్ద రాణించలేదు. అయినప్పటికీ వరుణ్ ఏమాత్రం తగ్గకుండా మరో యాక్షన్ మూవీని ఎంచుకున్నాడు. మరి ప్రవీణ్ సత్తారు అయినా వరుణ్ తేజ్ యాక్షన్ ముచ్చట నెరవేరుస్తాడో లేదో చూడాలి.
