వరుస విజయాలతో దూకుడు మీదున్న నటుడు వరుణ్ తేజ్.. ఇటీవల 'ఎఫ్ 2' చిత్రంతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా తన కొత్త సినిమాను కూడా మొదలుపెట్టేశాడు ఈ హీరో.

హరీష్ శంకర్ తో కలిసి చేయబోతున్న సినిమాకు సంబంధించిన టైటిల్ ను, కాన్సెప్ట్ పోస్టర్ ను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విడుదల చేశారు. ఈ సినిమాకు 'వాల్మీకి' అనే టైటిల్ ని ఖరారు చేశారు.

టైటిల్ లో తుపాకీ, సినిమా రీల్ చిత్రాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తమిళంలో ఘన విజయం అందుకున్న 'జిగర్తండా' సినిమాకు రీమేక్ గా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతుంది.

ఫిబ్రవరి నుండి సినిమా షూటింగ్ మొదలుకానుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివారాలు వెల్లడించనున్నారు.