Asianet News TeluguAsianet News Telugu

ఇటలీ బయలుదేరిన వరుణ్ తేజ్, లావణ్య, పెళ్ళి ఏర్పాట్లు స్వయంగా చేస్తున్న ఉపాసన

మెగా ఫ్యామిలీలో పెళ్ళి బాజాలు మోగబోతున్నాయి. వరుణ్ తేజ్ పెళ్ళికి ఇంటలీలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.  పెళ్ళికి వారం రోజులు ముందే  ఇంటలీ ప్లైట్ ఎక్కారు వరుణ్ తేజ్, లావణ్య. 
 

varun tej lavanya went to Italy for lavish wedding upasana joins them JMS
Author
First Published Oct 22, 2023, 1:08 PM IST

మెగావారింట పెళ్లి బాజాలు మోగనున్నాయి. మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు.. టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమ పెళ్లికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. త్వరలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు ఇద్దరు టాలీవుడ్ స్టార్స్. నవంబర్ 1న వీరి వివాహం ఇటలీలోని టుస్కానీలో ఉన్న బోర్గో శాన్ ఫెలైస్ రిసార్ట్ లో అత్యంత ఘనంగా జరగబోతోంది. ఈ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. అయితే పెళ్ళిక ఇంకా వారం రోజులు పైనే ఉండటంతో.. అక్కడ ఏర్పాట్లు స్వయంగా చూసేందుకు  వారం ముందే వరుణ్ తేజ్, లావణ్య టుస్కానీ బయల్దేరి వెళ్లిపోయారు. 

వరుణ్ తేజ్  ఇటలీ వెళ్తున్నట్టుగా.. విమానంలో విండో నుంచి తీసిన ఫొటోని  తన ఇన్ స్టా గ్రామ్  పేజ్ లో షేర్ చేశాడు. ఇక వీరి పెళ్ళి ఏర్పాట్లను స్యంగా దగ్గరుండి చేయించబోతున్నారు మెగా కోడలు.. రామ్ చరణ్ సతీమణి ఉపాసన.  ఈ జంటకు  తోడుగా రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని కూడా టుస్కానీ చేరుకున్నారు. డబుల్ రెయిన్ బో , టుస్కానీ అంటూ ఆమె ఒక ఫోటోని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. 

నవంబర్ 1న టుస్కానీలో జరిగే ఈ వివాహానికి చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగబాబు ఇలా మెగా ఫ్యామిలీ తరఫున అన్ని కుటుంబాలు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. హాల్దీ, మెహెందీ, సంగీత్, వివాహం ఇలా నాలుగు రోజుల పాటు పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరగబోతోంది. అంతే కాదు అదుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.  ఇక ఈ పెళ్లి తరువాత అటు నుంచి అటే కొత్త జంట హనీమూన్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారట.  పెళ్లి తర్వాత వరుణ్, లావణ్య నెల రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా పర్యటించనున్నారు. 

అయితే ఇటలీలో పెళ్ళి జరగబోతుండటంతో.. ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు.. బంధువులు, స్నేహితుల కోసం మెగా ఫ్యామిలీ హైదరాబాద్ లో భారీ ఎత్తున  రిసెప్షన్ కూడా ప్లాన్ చేస్తున్నారట. మెగా ప్రిన్స్ పెళ్ళి సందడి మొదలవ్వడంతో. .మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం  వరుస ఫెయిల్యూర్స్ తో బాధపడుతున్న వరుణ్ తేజ్.. ప్రస్తుతం మిషన్ వేలెంటేన్ సినిమా చేస్తున్నాడు. అటు లావణ్య త్రిపాఠి ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. తరువాత నటిస్తుందా లేదా అనేది చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios