సారాంశం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇన్నేళ్లు ఎవరికీ తెలియకుండా సైలెంట్ గా ప్రేమాయణం సాగించిన వరుణ్ తన కోస్టార్ లావణ్య త్రిపాఠిని జీవిత భాగస్వామిగా చేసుకోబోతున్నాడు. 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇన్నేళ్లు ఎవరికీ తెలియకుండా సైలెంట్ గా ప్రేమాయణం సాగించిన వరుణ్ తన కోస్టార్ లావణ్య త్రిపాఠిని జీవిత భాగస్వామిగా చేసుకోబోతున్నాడు. ఇందులో మొదటి ఘట్టం నిశ్చితార్థం పూర్తయింది. 

మెగా ఫ్యామిలీ, లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యుల సమక్షంలో శుక్రవారం రోజు వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. వరుణ్ తేజ్, లావణ్య ప్రేమ వ్యవహారం గురించి ఇప్పుడిప్పుడే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వీరిద్దరి ఎంగేజ్మెంట్ పిక్స్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసే విధంగా ఉన్నాయి. వరుణ్ తేజ్ ఆరడుగుల అందగాడిగా కనిపిస్తుండగా.. లావణ్య త్రిపాఠి సొట్టబుగ్గల అందంతో మైమరిపిస్తోంది. 

ఇదిలా ఉండగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మిస్టర్, అంతరిక్షం లాంటి చిత్రాలలో కలసి నటించారు. వీరిద్దరి ప్రేమకి బీజం పడింది మిస్టర్ చిత్రంతోనే అట. మిస్టర్ షూటింగ్ కోసం ఇటలీ వెళ్ళినప్పుడు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డట్లు తెలుస్తోంది. కెరీర్ లో బాగా స్థిరపడే వరకు తమ ప్రేమ వ్యవహారాన్ని బయటకు రానీయలేదు. 

ఎంగేజ్మెంట్ పూర్తి కావడంతో పెళ్లి గురించి చర్చ మొదలయింది. మెగా ఫ్యామిలీ వరుణ్, లావణ్య వివాహాన్ని డెస్టినేషన్ వెడ్డింగ్ గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  తమ ప్రేమ చిగురించిన ఇటలీలోనే పెళ్లి కూడా జరగాలని వరుణ్, లావణ్య భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటలీ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కి పెట్టింది పేరు. చాలా ఏమండీ సెలెబ్రిటీలు ఇటలీలో వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు. కానీ వరుణ్ తేజ్, లావణ్య లకి ఇటలీ లవ్ సెంటిమెంట్ గా కూడా కలసి వస్తోంది అని అంటున్నారు. త్వరలోనే వరుణ్ లావణ్య వివాహానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.