గ్రాండ్‌గా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వెడ్డింగ్.. మూడుముళ్ల బంధంతో ఒక్కటైన జంట.. ఐదేళ్ల ప్రేమకి శుభం కార్డ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల పెళ్లి చాలా గ్రాండ్‌గా జరిగింది. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా అంగరంగ వైభవంగా నిర్వహించారు. మూడుముళ్ల బందంతో ఈ జంట ఒక్కటి కావడం విశేషం.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. ఐదేళ్ల ప్రేమ బంధానికి ముగింపు పలికారు. తమ ప్రేమకి శుభం కార్డ్ వేసుకున్నారు. ఎట్టకేలకు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ముహూర్తం ప్రకారం సాయంత్రం ఏడు గంటల 18 నిమిషాలకు వీరి వివాహం జరిగింది. చాలా లావిష్ మ్యానర్‌లో, గ్రాండియర్‌గా వరుణ్‌లవ్ పెళ్లి వేడుక జరగడం విశేషం.
లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్లు వేసి ఓ ఇంటివాడయ్యాడు వరుణ్. అలాగే మెగా ప్రిన్స్ తో మూడు ముళ్లు వేయించుకుని అధికారికంగా మెగా కోడలు అయ్యింది లావణ్య. మొత్తంగా ఈ ఇద్దరు పెళ్లి జీవితంలోకి అడుగుపెట్టారు. ఎన్నో కలలు, ఎన్నో ఆశలు, ఆశయాలతో ఈ జంట భారతీయ, తెలుగు సాంప్రదాయాల ప్రకారం ఒక్కటి కావడం విశేషం. పెళ్లి ఇటలీలో జరిగినా, మనవైన ట్రెడిషన్‌ని ఫాలో అవడం విశేషంగా చెప్పొచ్చు.
అంతకు ముందు పెళ్లి వేదిక వద్దకి వరుణ్ తేజ్, లావణ్య లగ్జరీ కారులు రాయల్ లుక్‌లో ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఇందులో మెగా ఫ్యామిలీ అంతా వరుణ్‌లవ్ లను స్వాగతించారు. అనంతరం వేదిక వద్ద డాన్సులతో హోరెత్తించారు. నాగబాబు, వరుణ్ తల్లి, నిహారిక వంటి వారు సంబరాల్లో మునిగిపోయారు. ఇందులో పవన్ కళ్యాణ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచార
ఇక ఈ పెళ్లి వేడుకలో మెగా ఫ్యామిలీ, అలాగే లావణ్య ఫ్యామిలీతోపాటు అతికొద్ది మంది ఇతర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్, ఆయన భార్య, రామ్‌చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహారెడ్డి, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, అల్లు అరవింద్ వారి ఫ్యామిలీ పాల్గొంది. వీరితోపాటు యంగ్ హీరో నితిన్ కూడా పాల్గొన్నారు. మొత్తంగా 120 మంది గెస్ట్ లు మాత్రమే ఈ పెళ్లి వేడుకకి హాజరైనట్టు తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం మ్యారేజ్‌కి సంబంధించిన విందు ఉంటుంది.
ఇటలీలో మూడు రోజులపాటు వరుణ్‌లవ్ మ్యారేజ్ వేడుక నిర్వహించారు. అక్టోబర్ 30 కాక్‌టెయిల్ పార్టీ, 31న హల్దీ, మెహందీ వేడుక నిర్వహించారు. ఈ రోజు(నవంబర్ 1)న గ్రాండ్‌గా పెళ్లి వేడుక చేశారు. ఇలా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు తమ ప్రేమకి శుభం కార్డ్ వేసుకున్నారని చెప్పొచ్చు.
వరుణ్ తేజ్, లావణ్య ల పెళ్లి ఇటలీలో జరిగింది. మొదటిసారి ఈ జంట ఇటలీలో తమ లవ్ ప్రపోజ్ చేసుకున్న నేపథ్యంలో మొదటిసారి కలుసుకున్న ప్లేస్‌కి గుర్తుగా ఈ ప్లేస్‌లోనే తమ పెళ్లి వేడుక నిర్వహించుకున్నారు. ఇటలీలోని ఈ టుస్కానీ ప్లేస్‌కి ఓ ప్రత్యేకత ఉంది. ఇది ఎనిమిదవ శతాబ్దానికి చెందిన పురాతన గ్రామం కావడం విశేషం. హిస్టారికల్‌గా బాగా పేరు సంపాదించింది. అత్యద్భుతమైన గ్రీనరీకి నెలవుగా నిలుస్తుంది.