Varun Tej - Lavanya Tripathi :మెగా ఫ్యామిలీ నుంచి మరో శుభవార్త వచ్చింది. తాజాగా వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి దంపతులు తల్లిదండ్రులయ్యారు. లావణ్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు
Varun tej - Lavanya Tripathi: మెగా ఫ్యామిలీ నుంచి మరో శుభవార్త వచ్చింది. తాజాగా వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి దంపతులు తల్లిదండ్రులయ్యారు. ఈ ఉదయం (బుధవారం) హైదరాబాద్‌లోని ప్రముఖ రెయిన్‌బో ఆసుపత్రిలో లావణ్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ హ్యాపీ న్యూస్ బయటకొచ్చిన వెంటనే సోషల్ మీడియాలో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా చిరంజీవి స్వయంగా తన కొత్త సినిమా ‘మన శంకరవరప్రసాద్‌గారు’ షూటింగ్ సెట్స్ నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లి వరుణ్ – లావణ్య దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుభవార్తపై రామ్ చరణ్, ఉపాసన కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “మెగా వారసుడి ఎంట్రీ” అంటూ శుభాకాంక్షల సందడి చేస్తున్నారు. గతేడాది (2023 నవంబర్) వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి వివాహం ఘనంగా జరిగింది. ఇప్పుడు వారిద్దరూ మెగా కుటుంబానికి వారసుడిని అందించడంతో, ఆ ఆనందం రెట్టింపైంది.
వరుణ్ తేజ్ మెగా బ్రదర్స్ నాగబాబు కుమారుడు. లావణ్య త్రిపాఠి తెలుగులో ‘అందాల రాక్షసి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ పరిశ్రమలో పెళ్లితోనే అందరి మనసులు గెలుచుకున్న ఈ జంట, ఇప్పుడు ముద్దుల బిడ్డకు తల్లిదండ్రులవ్వడం పట్ల అభిమానులు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తిస్తున్నారు.
