1980, 90 మధ్యకాలంలో విశాఖపట్నంలో చోటు చేసుకున్న వాస్తవ ఘటనల ఆధారంగా కరుణ కుమార్ పీరియాడికల్ క్రైమ్ స్టోరీని తెరకెక్కించనున్నారు. 


మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్ ప్రారంభం నుంచి హిట్,ప్లాఫ్ లకు సంభంధం లేకుండా విభిన్నమైన కథలు చేస్తున్నారు. అయితే హై సక్సెస్ ని మాత్రం ఇప్పటిదాకా చూడలేదు. అయితే తన ఛాయిస్ కు మాత్రం తిరుగులేదు అనే సినిమా చేయాలనే ఆయన భావిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఓ చిత్రం ఓకే చేసినట్లు సమాచారం. పలాస 1978 సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన కరుణ్ కుమార్ దర్శకత్వంలో వరుణ్ నటించనున్నారట. పలాసకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఆ తర్వాత సుధీర్ బాబు హీరోగా వచ్చిన శ్రీదేవి సోడా సెంటర్‌ కూడా మంచి పేరే తెచ్చుకుంది. ఆ వెంటనే గ్యాప్ తీసుకోకుండా మెట్రో కథలు, యాంథాలజీ, కళాపురం సినిమాలను తీశారు. ఇవి ఆహా ఓటీటీలో విడుదలై మంచి పేరు తెచ్చుకున్నాయి. దీంతో వినూత్నమైన కథలను తెరకెక్చించే మరో దర్శకుడు తెలుగుకు దొరికినట్లయ్యింది.

రీసెంట్ గా కరుణ కుమార్ చెప్పిన కథ కి వరుణ్ తేజ్ ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.ఫిలిం సర్కిల్స్ లో వినపడుతున్న దాని ప్రకారం.. 1980, 90 మధ్యకాలంలో విశాఖపట్నంలో చోటు చేసుకున్న వాస్తవ ఘటనల ఆధారంగా కరుణ కుమార్ పీరియాడికల్ క్రైమ్ స్టోరీని తెరకెక్కించనున్నారు. ఇప్పటిదాకా తను చేయని క్యారెక్టర్‌లో వరుణ్ తేజ్ కనిపిస్తారని అంటున్నారు. అందుకోసం ప్రత్యేకమైన మేకప్ టేస్ట్ చేసారని అంటున్నారు. సోషల్ ఎవర్నెస్ ఉంటూనే పీరియాడిక్ క్రైమ్ ని తెరకెక్కించబోతున్నట్లు చెప్తున్నారు. రామ్ చరణ్ చేసిన రంగస్దలం లాంటి కథ ఇదని అంటున్నారు. అయితే ఇది అర్బన్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ. వైజాగ్ హార్బర్ కు సైతం ఈ సినిమాలో ప్రత్యేక స్దానం ఉంటుందంటున్నారు. నిజమెంత అనేది తెలియాలంటే సినిమా ప్రారంభం కావాల్సిందే. ఈ మేరకు సెట్స్ వేసి షూట్ చేయబోతున్నారు. 

చాలా రీసెర్చ్ చేసిన తర్వాత కరుణ కుమార్ ఈ సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ కథ వినగానే వరుణ్ ఎగ్జయిట్‌ అయ్యారట. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను వైరా ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ప్రొడ్యూస్ చేయనుంది. ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో కరుణకుమార్- వరుణ్ తేజ్ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం వుంది. ప్రస్తుతం కరుణ కుమార్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మీద దృష్టి పెట్టారని తెలిసింది. నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar)ను సంగీత దర్శకుడిగా తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇకపోతే.. వరుణ్ తేజ్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘‘గాంఢీవదారి అర్జున’’. మరొకటి ఏవియేషన్ థ్రిల్లర్.