దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనేది పాత సామెత. క్రేజ్ ఉన్నప్పుడే కోట్లు వెనకేసుకోవాలనేది నేటి యూత్  నమ్మే సిద్దాంతం. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఉన్న వారు దీన్ని బాగా నమ్ముతారు. ఓ హిట్ పడగానే రెమ్యునేషన్ ని రైజ్ చేసేస్తారు. ఇంక వరస హిట్స్ వస్తే చెప్పేదేముంది. ఇప్పుడు వరుణ్ తేజ్ అదే చేస్తున్నారు. తన రెమ్యునేషన్ అమాంతం పెంచేసారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 

మెగా ఫ్యామిలీనుంచి వచ్చిన వరుణ్ తేజ మెల్లిగా కెరీర్ లో నిలదొక్కుకున్నాడు. ఫిధా, తొలి ప్రేమ,ఎఫ్ ఇలా వరస  హిట్స్  తో పూర్తి స్దాయి బిజీ అయ్యిపోయారు.  తెలుగులో పూర్తి డిమాండ్ ఉన్న కుర్ర హీరోల్లో వరుణ్ తేజ ఒకరు గా మారారు.  ఆయన తన రెమ్యునేషన్ ని రీసెంట్ గా పెంచారని టాక్. అప్పటి వరకూ మూడు కోట్లు మాత్రమే తీసుకునే వరుణ్ తేజ...తన డిమాండ్ ని గుర్తించి   ఐదు కోట్లు చేసినట్లు తెలుస్తోంది. అయినా సరే వన్ పర్శంట్ కూడా వరుణ్ తేజ డిమాండ్ తగ్గలేదట. ఒక్క ప్రొడ్యూసర్ కూడా వెనకడగు వెయ్యటం లేదట. 

వరుణ్ తేజ తో చేస్తే హ్యాపీగా బిజినెస్ అయ్యిపోతుందనే నమ్మకమే వారిని ఐదు కోట్లు వరకూ ఇచ్చేలా చేస్తోందిట. ప్రస్తుతం వరుణ్ తేజ ఓ స్పోర్ట్స్ డ్రామాలోనూ, హరీష్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి చిత్రంలోనూ నటిస్తున్నారు. వాల్మీకి చిత్రం లో వరుణ్ నెగిటివ్ టచ్ ఉన్న క్యారక్టర్ లో కనిపించబోతున్నారట. ఆ సినిమా రిలీజ్ అయ్యితే వరుణ్ తేజ్ కు ఫ్యాన్స్ రెట్టింపు అవుతారనే ధీమాతో ఉన్నారు.