కొన్ని కొన్ని సినిమా వాళ్ల రియల్ సీన్స్ భలే విచిత్రంగా ఉంటాయి. మరికొన్ని అందరూ ఇంప్రెస్ అయ్యే విధంగా ఉంటాయి.. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, సమంతక సంబంధించిన ఇలాంటి ఓ సిచ్యూవేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

బాలీవుడ్ హ్యాడ్సమ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి తొలిసారి సమంత నటించబోతోంది. హాలీవుడ్ సిరీస్ సిటడెల్కు ఇండియన్ వెర్షన్ లో ఈ ఇద్దరు స్టార్లు జట్టుకట్టబోతుంది. ఈ ప్రాజక్ట్ కే సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధిచిన చర్చల కోసం వాళ్లిద్దరూ నిన్న రాత్రి సమావేశమయ్యారు. ఇప్పటికే హాలీవుడ్ మూవీలో నటిస్తున్న సమంత బాలీవుడ్ లో కూడా యంగ్ స్టార్స్ సరసన ఛాన్స్ లు కొట్టేస్తూ.. బిజీ కాబోతోంది. 

ఇక ముంబయ్ లో ఈ మీటింగ్ అయిపోయిన తరువాత సమంత బయటకు వెళ్లిపోతున్న సందర్భంలో అంతా హడావిడి అయిపోయింది. ఫొటో జర్నలిస్టులు అంతా ఆమె చూటు చేరి ఫొటోల కోసం ప్రయత్నించారు. దీంతో హీరో వరుణ్ ధావన్.. ఆమెను ఒక భౌన్సర్ లా కాపాడాడు. ఫొటో జర్నలిస్టుల ను పక్కకు వెళ్ళమంటూ సముదాయిస్తూ.. వాళ్లను ఉద్దేశిస్తూ సరదా వ్యాఖ్యలు చేశాడు. హేయ్..హేయ్.. జరగండి..జరగండి. ఎందుకు ఆమెను అలా భయపెడుతున్నారు? భయపెట్టకండి ఆమెను’’ అంటూ కామెంట్ చేశాడు. సమంతకు ఎస్కార్ట్ లాగా కారు దాకా వెళ్లాడు. 

View post on Instagram

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో భాగా వైరల్ అవుతుంది. బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న వరుణ్ ధావన్... రీల్ హీరోలా మాత్రమే కాదు రియల్ హరోగా బిహేవ్ చేశాడంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వరుణ్ చేసిన పనికి ఇంప్రెస్ అవుతున్నారు అభిమానులు అమ్మాయిలయితే.. వరుణ్ కు కు ఫిదా అయిపోతున్నారు.

ఇక సమంత, వరుణ్ ధావన్ నటించబోతున్న ఈ సిరీస్ ను తెలుగు దర్శక ద్వయం రాజ్ అండ్ డీకేలు డైరెక్ట్ చేయబోతున్నారు. బ్రిటన్ లో ఇదే సిరీస్ కు ప్రియాంక చోప్రాను హీరోయిన్ గా తీసుకున్నారు. కాగా, ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో అభిమానులను అలరించిన సమంత.. ఇప్పుడు సిటడెల్ తో మరింత దగ్గరకానుంది. ఇటీవల ఈ షో గురించి మాట్లాడిన సమంత.. తనకు ఫ్యామిలీ మ్యాన్ 2లో లభించిన రాజీ లాంటి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర మళ్లీ దొరుకుతుందని తాను అనుకోవట్లేదని చెప్పింది.