హిందీ చిత్ర పరిశ్రమలో పండుగ వాతావరణ నెలకొంది. ఉత్తరాధిలో ప్రముఖంగా జరుపుకునే కార్వ చౌత్‌ ఫెస్టివల్‌తో సెలబ్రిటీలు బిజీ అయిపోయారు. ఓ వైపు కాజోల్‌, మరోవైపు కాజల్‌ కార్వ చౌత్‌ పూజలో పాల్గొన్నారు. తాజాగా వరుణ్‌ ధావన్‌ లవర్‌ కూడా ఈ వేడుకలో పాల్గొంది. తమ ఫ్యామిలీతో కలిసి ఆమె ఈ వేడుకని సెలబ్రేట్‌ చేసుకుంది. కుటుంబ సభ్యులంతా వరుణ్‌ ధావన్‌ లేడీ లవ్‌ నటాషా దలాల్‌ చుట్టూ చేరి సందడి చేశారు. మధ్యలో నటాషా సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. 

ఇందులో ఆమె రెడ్‌ శారీ ధరించి కనువిందుగా ఉన్నారు. ఆమె లుక్‌ ఆద్యంతం కట్టిపడేస్తుంది. మరోవైపు ఇందులో వరుణ్‌ ధావన్‌ మదర్‌ లాలీ, వదిన జాన్వీ ఉన్నారు. ఈ ఫోటోలను భావన పాండే ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నటాషాతో గత ఏడాది కాలంగా వరుణ్‌ ధావన్‌ ప్రేమాయణం సాగిస్తున్నారు. వీరిద్దరు ఇటీవల తమ  ఫోటోలను పంచుకుంటూ రిలేషన్‌ని బయట పెట్టారు.

View this post on Instagram

♥️♥️♥️

A post shared by Bhavana Pandey (@bhavanapandey) on Nov 4, 2020 at 5:23am PST