హీరో ప్రేయసి విలన్ అయితే..!

varalakshmi turns villain for vishal's film
Highlights

తెలుగు అబ్బాయి అయినప్పటికీ విశాల్ తమిళంలో చక్కటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు

తెలుగు అబ్బాయి అయినప్పటికీ విశాల్ తమిళంలో చక్కటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క నడిగర్ సంఘం బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. తాజాగా ఈ హీరో నటించిన 'ఇరుంబు తిరై' సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమా విడుదల రోజే విశాల్ నటించిన కొత్త సినిమా 'సెండైకోళి 2' ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఇది 'సెండైకోళి' సినిమాకు సీక్వెల్. ఈ సినిమాను పందెంకోడి పేరుతో తెలుగులో విడుదలైంది. తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

కాబట్టి సీక్వెల్ ను కూడా తెలుగులో విడుదల చేసే ఛాన్స్ ఉంది. ఈ సినిమా ట్రైలర్ లో తమిళ నేటివిటీ కొట్టొచ్చినట్లుగా  కనిపిస్తుంది. కానీ అన్ని కమర్షియల్ హంగులను బాగానే దట్టించారు కాబట్టి తెలుగులో కూడా క్లిక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపిస్తుండగా విశాల్ తండ్రిగా పండెంకోడిలో కనిపించిన రాజ్ కిరణ్ కనిపించనున్నారు.

ఇక సినిమాలో చెప్పుకోవాల్సిన విషయమేమిటంటే విశాల్ మాజీ ప్రేయసి వరలక్షీ విలన్ గా కనిపించనుంది. ఆమె గెటప్ చూస్తుంటే 'పొగరు' సినిమాలో శ్రియారెడ్డి గుర్తొస్తుంది. గత కొంతకాలంగా విశాల్, వరలక్ష్మీ దూరంగానే ఉంటున్నారు. అయితే తెరపై ఈ జంట ప్రత్యర్దులుగా కనిపిస్తుండడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మరి సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి!

loader