‘హనుమాన్’ కి ‘క్రాక్’జయమ్మ విలన్
‘క్రాక్’ లో జయమ్మగా అద్భుతమైన నటన కనబరిచటం ...తన తాజా చిత్రంలో విలన్ గా ప్రశాంత్ వర్మ ఎంపిక చేసినట్లు సమాచారం. ఆ సినిమా మరేదో కాదు...హనుమాన్.
కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగులో క్రాక్ జయమ్మ గా దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమెకి తెలుగు నుంచి మరో బంపర్ ఆఫర్ వచ్చిందని సమచారం. ‘క్రాక్’ లో జయమ్మగా అద్భుతమైన నటన కనబరిచటం ...తన తాజా చిత్రంలో విలన్ గా ప్రశాంత్ వర్మ ఎంపిక చేసినట్లు సమాచారం. ఆ సినిమా మరేదో కాదు...హనుమాన్.
అ!, కల్కి, జాంబిరెడ్డి చిత్రాలతో వైవిధ్య కథల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ మరోకథకి శ్రీకారం చుట్టారు. రీసెంట్ గా తన పుట్టినరోజు సందర్భంగా కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ‘హనుమాన్’ అనే వినూత్న కథని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. ఈ సినిమా లో హీరోగా జాంబీ రెడ్డి హీరో తేజ సజ్జా నటించబోతున్నట్లుగా ఇటీవలే వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్రను వరలక్ష్మి పోషించబోతున్నట్లుగా తెలుస్తోంది. వరలక్ష్మి ని ఈ సినిమాలో నటింపజేయడం వల్ల ఖచ్చితంగా హను మ్యాన్ క్రేజ్ మరింతగా పెరిగింది.
‘ఈసారి నాకు బాగా ఇష్టమైన జానర్‌తో వస్తున్నా. హనుమాన్.. తెలుగులో తెరకెక్కుతోన్న తొలి ఒరిజినల్ సూపర్ హీరో చిత్రం’ అని తెలిపారు ప్రశాంత్. ఈ మేరకు ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. కొవిడ్‌తో పోరాటం చేస్తోన్న సూపర్ హీరోలకు ఈ చిత్రం అంకితం అని పేర్కొన్నారు. తారాగణం, సాంకేతిక బృందం వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. మరి హనుమాన్ కథలో జయమ్మ పాత్రేంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
అలాగే ఆమె కెరీర్ లోనే గుర్తుండి పోయే రోల్ ఇచ్చిన మాస్ డైరెక్టర్ గోపీచంద్ .. ఇప్పుడు ‘#NBK107’ లో కూడా ఓ పాత్రను క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. బాలయ్యతో డీ అంటే డీ అనే విధంగా జయమ్మ పాత్ర ఉండబోతుందని తెలుస్తుంది. నరసింహాలో నీలాంబరిగా రమ్యకృష్ణ పాత్రను ఎలాగైతే డిజైన్ చేశారో దానికి మించి ఈ పాత్ర ఉండబోతుందని తెలుస్తుంది.
ఇక ఇప్పటికే వెయిటింగ్ ఫర్ యువర్ రొరింగ్ అంటే షూటింగ్ లో మీ గర్జన కోసం ఎదురుచూస్తున్నాం అంటూ బాలయ్యను ఉద్దేశించి వదిలిన NBK107 బర్త్ డే టీజర్ బాలకృష్ణ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్న తరుణంలో ఇప్పుడు బాలయ్య పక్కన జయమ్మ నటించబోతుందన్న న్యూస్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసిందనే చెప్పొచ్చు.