పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బెస్ట్ హిట్ గా నిలిచిన 'అత్తారింటికి దారేది' సినిమాను ఇప్పుడు తమిళంలో రీమేక్ చేస్తున్నారు. శింబు హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి 'వంత రాజవతాన్ వరువేన్' అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేశారు.

దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది. సుందర్ సి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా టీజర్ ని తాజాగా విడుదల చేశారు. టీజర్ ని బట్టి 'అత్తారింటికి దారేది' సినిమాను మక్కీకి మక్కీ దించేసినట్లు తెలుస్తోంది. సమంత ప్లేస్ లో మేఘా ఆకాష్, ప్రణీత ప్లేస్ లో క్యాథరిన్ త్రెసా హీరోయిన్లుగా కనిపిస్తున్నారు.

తెలుగులో నదియ పోషించిన పాత్రను తమిళంలో రమ్యకృష్ణ చేయడం విశేషం. దాదాపు సినిమాలో తెలుగు వారికి తెలిసిన కాస్టింగే ఉన్నారు. అయితే టీజర్ మాత్రం ఆకట్టుకునే 
విధంగా లేదు. క్వాలిటీ విషయంలో చాలా వరకు రాజీ పడినట్లు తెలుస్తోంది.

హీరో శింబు బాగా ఒళ్లు చేసి చాలా లావుగా కనిపిస్తున్నాడు. మాస్ సినిమా ఫీలింగ్ కలిగించే విధంగా టీజర్ ని కట్ చేశారు. మరి తెలుగు లో సక్సెస్ అయినట్లు తమిళంలో కూడా ఈ సినిమా విజయం అందుకుంటుందో లేదో చూడాలి!