సీనియర్‌  నటుడు విజయ్‌ కుమార్‌ కూతురు వనిత మూడో వివాహం సౌత్‌ ఫిలిం ఇండస్ట్రీలో సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే వనితను వివాహం చేసుకున్న పీటర్‌ పాల్‌ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ సీనియర్లు లక్ష్మీ రామకృష్ణన్‌, కస్తూరి లాంటి వారు వనిత మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శలపై వనిత కూడా ఘాటుగానే స్పందించింది.

సోషల్ మీడియా వేదికగా తన మీద విమర్శలు చేసిన వారిపై పోలీసు కంప్లైంట్ కూడా ఇచ్చింది వనిత. తాజాగా ఈ వివాదంలోకి నయనతారను కూడా లాగింది వనిత. `గతంలో ప్రభుదేవా కూడా తన భార్యకు విడాకులు ఇవ్వకుండా నయన్‌తో సహజీవనం చేశాడు కదా? ఆ సమయంలో ప్రభుదేవా భార్య రమాలత, ఆమె ముగ్గురు పిల్లలు ఎన్ని కష్టాలు పడ్డారో తెలియదా? అప్పుడు కనీసం మాట కూడా మాట్లాడలేని వారు ఇప్పుడెందుకింత రచ్చ చేస్తున్నారని వనిత ప్రశ్నించింది.

అయితే ఈ సందర్భంగా వని వాడిన భాష తీవ్ర అభ్యంతరాలకు కారణమైంది. కొన్ని అసభ్య పదాలు వాడటంతో నయనతార అభిమానులతో పాటు ఇండస్ట్రీ పెద్దలు కూడా వనిత మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వనిత మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్‌ చేస్తున్నారు. ఈ దెబ్బతో వనిత తన ట్విటర్‌ అకౌంట్‌ను డీ యాక్టివేట్‌ చేయాల్సి వచ్చింది.