శ్రీదేవి, షబానా అజ్మీ, జుహీ చావ్లా, జయ బాదురీలను స్టార్లని చేసిన వాణి జయరాం.. ఎలాగంటే..
అతిలోక సుందరీ శ్రీదేవి, అలనాటి తారలు షబానా అజ్మీ, జుహ్లీ చావ్లా, ఫర్వీన్ బాబీ, జయ బాదురీ సినిమా ఎంట్రీకి, సింగర్ వానీ జయరాం కి ఓ సంబంధం ఉంది. అదేంటనేది చూస్తే,

పాట ఆగిపోయింది. గాత్రం మూగబోయింది. వాణీ జయరాం మరణంతో ఇండియన్ సినిమా సంగీతం తల్లడిళ్లిపోతుంది. ఎన్నో వేల పాటలతో ఇండియన్ సినీ ప్రియులను అలరిస్తున్న వాణీ జయరాం మరణం భారతీయ సంగీతానికి, పాటకి తీరని లోటుగా చెప్పొచ్చు. అయితే సినిమాల విజయంలో పాటలు స్థానం ప్రత్యేకం. చాలా వరకు సగం పాత్ర పాటలే పోషిస్తుంటాయి. పాటలతోనూ హిట్ అయిన స్టార్ట్ ఉన్నాయి. అయితే వాణీ జయరాం పాటతో స్టార్లు అయిన హీరోయిన్లు ఉండటం విశేషం.
వాణి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతోపాటు సుమారు 15 భాషల్లో ఆమె పాటలు పాడి అలరించారు. వాణి జయరాంకి, శ్రీదేవికి ఓ ప్రత్యేక అనుబంధం ఉంది. ఇంకా చెప్పాలంటే అతిలోక సుందర శ్రీదేవి తెలుగు, తమిళం, హిందీలో హీరోయిన్‌గా ఎంట్రీకి, వాణీ జయరాంకి సంబంధం ఉండటం విశేషం. మరి అదెలా అనే చూస్తే, శ్రీదేవి హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన ఈ మూడు భాషల్లో తొలి సినిమాకి వాణీ జయరాం పాటలు పాడటం విశేషం.
శ్రీదేవి తెలుగులో `అనురాగాలు`(1976) చిత్రంతో హీరోయిన్‌గా మారింది. అంతకు ముందు బాలనటిగా చాలా సినిమాలు చేసింది. కానీ ఈ సినిమాతో ఆమె మెయిన్ హీరోయిన్‌గా మెరిసింది. ఇందులో పాటలకు సత్యం సంగీతం అందించిన ఈచిత్రంలో వాణీ జయరాం పాటలు పాడారు. ఆ తర్వాత శ్రీదేవి తెలుగులో సూపర్ స్టార్‌గా ఎదిగిన విషయం తెలిసిందే. మరోవైపు శ్రీదేవి అదే ఏడాది తమిళంలో `మూండ్రు ముడిచు` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. కమల్ హాసన్, రజనీకాంత్ నటించిన ఈ సినిమాకి బాలచందర్ దర్శకత్వం వహించారు. ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో `వసంత కాల`, `ఆడి వెళ్లి` అనే రెండు పాటలు పాడారు.
మరోవైపు హిందీలో `సోల్వా సావన్` చిత్రంతో బాలీవుడ్‌కి పరిచయమైంది శ్రీదేవి. తమిళంలో భారతీరాజా రూపొందించిన `పదహారు వయదినలే`కి రీమేక్. ఆయనే రూపొందించారు. ఇందులో వాణి జయరాం మూడు పాటలు పాడారు. ఇలా హీరోయిన్ శ్రీదేవి పరిచయం అయిన ఈ మూడు భాషల్లో తొలి సినిమాలో వాణీ పాటలు పాడటం విశేషం. అంతేకాదు ఆమెతోపాటు జయబాదూరి పరిచయ సినిమాలో, షబానా అజ్మీ, పర్వీన్ బాబీ, జూహీ చావ్లా పరిచయ సినిమాల్లో వాణీనే పాటలు పాడటం విశేషం. వీరంతా తిరుగులేని సూపర్ స్టార్లుగా ఎదిగారు. దీనిపై వాణి జయరాం మాట్లాడుతూ, తాను ఈ హీరోయిన్ల తొలి సినిమాలో పాటలు పాడానని, వారంతా స్టార్లు ఎదిగారని, అందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది వాణిజయరాం.