వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'వాల్మీకి'. తమిళ హీరో అధర్వ ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. పూజాహెగ్డే, మృణాలిని రవి హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ గా డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించనుంది. 

తమిళంలో సూపర్ హిట్ అయిన 'జిగార్తండా' సినిమాకు రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. బోయ వర్గానికి చెందిన వారు సినిమా టైటిల్ మార్చాలని లేకపోతే షూటింగ్ ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఒకసారి షూటింగ్ స్పాట్ కి వెళ్లి చిత్రీకరణ ఆపేలా చేశారు. ఇప్పటికీ ఆ వివాదం సద్దుమణగలేదు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను సెప్టెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. సినిమాకు సంబంధించిన టీజర్ ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న విడుదల చేయబోతున్నట్లుగా  చిత్రబృందం ప్రకటించింది.

ఈ విషయాన్ని తెలియజేస్తూ వరుణ్ తేజ్ లుక్ ని విడుదల చేసింది. ఐదు తలలతో వరుణ్ తేజ్ లోని విభిన్న కోణాలను చూపిస్తున్న ఈ పోస్టర్ భయపెట్టేలా ఉంది. వరుణ్ తేజ్ ఎక్స్ ప్రెషన్స్, పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాను  నిర్మిస్తున్నారు.