హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక సినిమాకు సంబందించిన ప్రమోషన్ డోస్ ని పెంచి సినిమాకు మరింత హైప్ ని క్రియేట్ చేయాలనీ దర్శకుడు హరీష్ శంకర్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 15న నిర్వహించనున్నారు. 

శిల్పకళా వేదికలో సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం కానున్న ఈవెంట్ కు ముఖ్య అతిధిగా విక్టరీ వెంకటేష్ రానున్నారు. చిత్ర యూనిట్ ఈ విషయాన్నీ అధికారికంగా తెలియజేసింది. ఇదివరకే వరుణ్ తేజ్ వెంకటేష్ తో F2 సినిమా ద్వారా దగ్గరయ్యాడు. ఆ సినిమా అత్యధిక లాభాలను అందించి హీరోల కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చింది. 

ఇక ఈ నెల వాల్మీకి సినిమాతో రాబోతున్న వరుణ్ కోసం వెంకటేష్ తనవంతు సహకారాన్ని అందిస్తున్నాడు. పూజా హెగ్డే నటిస్తున్న వాల్మీకి సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తుండగా అథర్వ మరో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు

.