మెగా హీరో వరుణ్ తేజ్ ఈ ఏడాది F2 సినిమాతో మంచి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు. నెక్స్ట్ వాల్మీకి సినిమాతో కూడా అదే తరహాలో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా వాల్మీకి సినిమా కోసం సరికొత్త గెటప్ ను సెట్ చేసుకున్నాడు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు రెస్పాన్స్ అదిరిపోయింది. 

దీంతో నెక్స్ట్ టీజర్ ను ఆడియెన్స్ అంచనాలకు రీచ్ అయ్యేలా రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో పది రోజుల్లో సినిమా టీజర్ ను రిలీజ్ చేసి ప్రమోషన్స్ డోస్ కూడా పెంచాలని దర్శకుడు హరీష్ శంకర్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక సినిమాను సెప్టెంబర్ 13న రిలీజ్ చేయాలనీ ఫిక్స్ అయ్యారు. అదే తేదికి నాని గ్యాంగ్ లీడర్ కూడా కన్ఫార్మ్ అయ్యింది. 

ఎంతో కొంత పోటీ తప్పదు కాబట్టి సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలనీ చూస్తున్నారు. అయితే సినిమా షూటింగ్ అయిపోవడానికి ఇంకా రెండు వారలా సమయం పట్టవచ్చు. అలాగే ప్రీ ప్రొడక్షన్ పనులకు కూడా చాలా సమయం పడుతుంది. ఇలా అన్ని పనులు చూసుకుంటూనే సినిమా ప్రమోషన్స్ ని కూడా ఎక్కడా తగ్గకుండా కొనసాగించాలని వాల్మీకి టీమ్ ప్లాన్ వేసుకుంటోంది. మరి ఆ సినిమా అభిమానుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.