Asianet News TeluguAsianet News Telugu

'వాల్మీకి' ప్రీ టీజర్.. మాటలుండవ్!

టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ నటిస్తోన్న నూతన చిత్రం 'వాల్మీకి'. దర్శకుడు హరీష్ శంకర్ రూపొందిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది. 

valmiki movie pre teaser release date fixed
Author
Hyderabad, First Published Jun 22, 2019, 1:58 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ నటిస్తోన్న నూతన చిత్రం 'వాల్మీకి'. దర్శకుడు హరీష్ శంకర్ రూపొందిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది. గతంలో వరుణ్, పూజాలు కలిసి 'ముకుంద' సినిమాలో నటించారు.

మరోసారి ఈ జంట వెండితెరపై జంటగా కనిపించనున్నారు. అయితే 'వాల్మీకి' సినిమా ప్రీటీజర్ ని సోమవారం సాయంత్రం 5:18 గంటలకు విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ ప్రీటీజర్ చూపించడానికి ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు  చెప్పారు.

అయితే ఇది కేవలం ప్రీటీజర్ మాత్రమేనని ఎలాంటి డైలాగ్స్ ఉండవని క్లారిటీ ఇచ్చారు. తమిళంలో సూపర్ హిట్ అయిన 'జిగార్తండ' సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్య షూటింగ్ కి వెళ్తున్న వరుణ్ తేజ్ కారుకి ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.

అయినప్పటికీ ఎలాంటి గ్యాప్ ఇవ్వకుండా చిత్రయూనిట్ షూటింగ్ జరుపుతోంది. ఈ సినిమాలో తమిళ హీరో ఆదర్వా ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.  

 

Follow Us:
Download App:
  • android
  • ios