Asianet News TeluguAsianet News Telugu

'పుష్ప' గెటప్ లో నితిన్, స్మగ్లర్ గానే...అసలు నిజం ఇదీ

రా అండ్ రస్టిక్ లుక్ లో నితిన్ కనిపించబోతున్నాడట. పుష్ప సినిమాలో లానే ఈ సినిమాలో నితిన్ స్మగ్లర్ గా కనిపిస్తున్నాడని టాక్. ఇప్పటికే మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. 

Vakkantham Vamsi Nithin Movie Similar to Pushpa Line?
Author
First Published Nov 28, 2022, 6:26 PM IST

  మాచర్ల నియోజకవర్గం  డిజాస్టర్ తో నితిన్ డీలా పడ్డాడనే చెప్పాలి.  ఎడిటర్ గా ఉండి దర్శకుడిగా మారిన దర్శకుడు రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంటాడని నితిన్ భావించాడు కానీ ఆ ప్రయత్నం అయితే సఫలం కాలేదు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత నితిన్ వక్కంతం వంశీ డైరెక్షన్ లో ఒక సినిమా ఓకే  చేశారు. ఆ సినిమా ప్రారంభమైంది. నితిన్ కెరియర్ లో 32వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి మారేడుమిల్లి అడవిలో ప్రారంభమైంది.

అయితే ఇక్కడ ఒక ఇంట్రస్టింగ్ విషయం తెర మీదకు వచ్చింది అదేమిటంటే ఈ సినిమాలో నితిన్ ఒక స్మగ్లర్ పాత్రలో కనిపించబోతున్నాడని, అంతేకాక ఆ స్మగ్లర్ పాత్రలో కనిపిస్తూ కూడా పూర్తిగా గడ్డంతో రఫ్ లుక్ లో కనిపిస్తాడని వినపడుతోంది. దానికి తోడు ఈ సినిమాలో నితిన్ లారీ డ్రైవర్ గా కూడా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్టుగానే షూటింగ్ కూడా మారేడుమిల్లి అడవుల్లోనే జరుగుతూ ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అవన్నీ పుష్పని గుర్తు చేసేవే కాబట్టి.

పుష్ప సినిమాలో కూడా అల్లు అర్జున్ ఒక స్మగ్లర్ గా, లారీ నడుపుతాడు పూర్తిగా గడ్డంతో రఫ్ లుక్ లో కనిపిస్తాడు. పుష్ప సినిమా షూటింగ్ కూడా దాదాపుగా మారేడుమిల్లిలోనే జరిగింది. అయితే ఇవన్నీ గుర్తు రాగానే అసలు ఇప్పుడు నితిన్ ఎందుకు ఇలాంటి సబ్జెక్ట్ చేస్తున్నాడా అనే చర్చ జరుగుతోంది. అయితే అందుతున్న సమాచారం మేరకు ...ఇదొక ఫన్ ఫిల్మ్ అని, నితిన్ ఈ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపించబోతున్నాడని సమాచారం. చాలా కొత్త జబ్జెక్టు అని, నితిన్ కెరీర్ ని మలుపు తిప్పే సబ్జెక్టు అవుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో నితిన్ సరసన హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటించబోతోంది. 

వక్కంతం వంశీ రైటర్ గా ఎన్నో మంచి కథలను అందించాడు. రైటర్‌గా సక్సెస్ అయ్యాడు. అయితే దర్శకుడిగా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. నా పేరు సూర్య సినిమాతో వక్కంతం వంశీ దర్శకుడిగా మారాడు. ఎన్టీఆర్ కోసం రాసుకున్న ఈ కథ చివరకు బన్నీ వద్దకు వెళ్లిందట. బన్నీ కూడా ఎంతో ఇష్టంగానే ఈ సినిమా చేశాడట. కానీ సినిమా మాత్రం తేలిపోయింది. అయితే మళ్లీ రెండో చాన్స్ రావడానికి చాలా కాలమే పట్టింది.

Follow Us:
Download App:
  • android
  • ios