Asianet News TeluguAsianet News Telugu

‘వకీల్‌ సాబ్‌’:భారీ రేటుకు శాటిలైట్ రైట్స్ ,కానీ ఒక కండీషన్?

ఓటీటీల్లో కొత్త సినిమా రిలీజవడం అవ్వగానే ఫ్యామిలీ అంతా కలిసి చూసేస్తున్నారు. మధ్యలో యాడ్స్ తలనొప్పి లేకపోవటం, హెడ్ డీ క్వాలిటీ ఉండటం కలిసొస్తోంది. దీంతో ఆ తర్వాత టీవీలో సినిమా రిలీజైతే పట్టించుకునే పరిస్థితి ఉండట్లేదు. ఆ మధ్య కాలంలో నవీన్ చంద్ర సినిమా ‘భానుమతి రామకృష్ణ’ , సత్యదేవ్ ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ టీవిల్లో కూడా ఆశించిన స్పందన లేదు.  ఈ నేపథ్యంలో శాటిలైట్ మార్కెట్ పడిపోకుండా చూసుకోవాలంటే ఇలాంటి ఓ కండీషన్ తప్పనిసరి అని భావిస్తున్నారట. ఇక వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్   రూ. 15 నుంచి రూ. 17 కోట్ల వరకు రేటు ఫిక్సైనట్లు వినపడుతోంది.

 

VakeelSaab Satellite rights Sold to Gemini TV jsp
Author
Hyderabad, First Published Oct 29, 2020, 7:47 AM IST

త్రివిక్రమ్ తో చేసిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన పవన్‌  కల్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో బోనీ కపూర్‌ సమర్పణలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ‘పింక్‌’ తెలుగు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతమందిస్తున్నాడు.  ఈ చిత్రం రిలీజ్ కోసం పవన్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఈపాటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం లాక్ డౌన్ వల్ల వెనకబడింది.

ఈ  గ్యాప్ లో  ఓటిటి సంస్థలు నుంచి ఫ్యాన్సీ ఆఫర్లనే దిల్ రాజు ముందు ఉంచగా దిల్ రాజు ఆ డీల్ కు నో చెప్పటం జరిగింది. అది ప్రక్కన పెడితే.. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని  తెలుగు టెలివిజన్ టాప్ ఛానెల్స్ లో ఒకటైన జెమినీ టీవీ వారు సొంతం చేసుకున్నట్టుగా టాక్. అయితే ఓ కండీషన్ పెట్టారట. డిజిటిల్ స్ట్రీమింగ్ లేటు చేస్తామని, అందుకు ఓటీటిలతో మాట్లాడతామని హామీ ఇవ్వమని అడిగారంటున్నారు. ఎందుకంటే ఓటీటీల్లో కొత్త సినిమా రిలీజవడం అవ్వగానే ఫ్యామిలీ అంతా కలిసి చూసేస్తున్నారు. మధ్యలో యాడ్స్ తలనొప్పి లేకపోవటం, హెడ్ డీ క్వాలిటీ ఉండటం కలిసొస్తోంది.

 దీంతో ఆ తర్వాత టీవీలో సినిమా రిలీజైతే పట్టించుకునే పరిస్థితి ఉండట్లేదు. ఆ మధ్య కాలంలో నవీన్ చంద్ర సినిమా ‘భానుమతి రామకృష్ణ’ , సత్యదేవ్ ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ టీవిల్లో కూడా ఆశించిన స్పందన లేదు.  ఈ నేపథ్యంలో శాటిలైట్ మార్కెట్ పడిపోకుండా చూసుకోవాలంటే ఇలాంటి ఓ కండీషన్ తప్పనిసరి అని భావిస్తున్నారట. ఇక వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్   రూ. 15 నుంచి రూ. 17 కోట్ల వరకు రేటు ఫిక్సైనట్లు వినపడుతోంది.

ఇదే కండీషన్ మీద సన్ నెట్ వర్క్ వారు ఈ హక్కులను కూడా వారు భారీ ధరకే కొనుగోలు చేసినట్టుగా వినికిడి. లేటెస్ట్ గానే సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న “సర్కారు వారి పాట” అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న “పుష్ప” శాటిలైట్ హక్కులు కూడా అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. ఇపుడు ఆ లిస్ట్ లో “వకీల్ సాబ్” కూడా చేరినట్లైంది. అయితే ఈ విషయమై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

 నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘పవన్‌ అభిమానులు, సినీ ప్రేక్షకులు కోరుకునేలా ఓ పవర్‌ఫుల్‌ లాయర్‌ పాత్రలో పవన్‌  కల్యాణ్‌గారు కనిపించబోతున్నారు. కరోనా వైరస్‌ పరిస్థితులు కాస్త చక్కబడిన తర్వాత మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేసి, సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్‌ , కెమెరా: పి.ఎస్‌. వినోద్, కో ప్రొడ్యూసర్‌: హర్షిత్‌ రెడ్డి.

Follow Us:
Download App:
  • android
  • ios