Asianet News TeluguAsianet News Telugu

వేలల్లో వకీల్ సాబ్ బెనిఫిట్ షో టికెట్ ధర!

పవన్ సినిమాకు భారీ ఎత్తున డిమాండ్ ఉన్న నేపథ్యంలో వకీల్ సాబ్ మూవీ టికెట్ ధరలు అమాంతంగా పెంచేశారట. వకీల్ సాబ్ సాధారణ షో టికెట్ ధర రూ. 200గా చేశారట. అయితే రెండు తెలుగు  రాష్ట్రాలలో ఏప్రిల్ 8 అర్థరాత్రి నుండి బెనిఫిట్ షోలు ప్రదర్శించాలని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారట. 

vakeel saab benefit show ticket price shocks ksr
Author
Hyderabad, First Published Mar 30, 2021, 6:02 PM IST

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మూడేళ్ళుగా ఎదురుచూస్తున్న రోజు మరో రెండు వారాలలో రానుంది. ఏప్రిల్ 9న పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారిన పవన్ కళ్యాణ్ 2018లో విడుదలైన అజ్ఞాతవాసి చిత్రం తరువాత సినిమాలకు విరామం ప్రకటించారు.వెండితెరపై పవన్ ని మరలా చూడాలని ఫ్యాన్స్ ఆశపడగా,  2019లో మరలా రీ ఎంట్రీ ప్రకటించారు. వరుస చిత్రాలు ప్రకటించిన పవన్ కళ్యాణ్.. సోషల్ సబ్జెక్టు తో తెరకెక్కిన హిందీ చిత్రం పింక్ రీమేక్ ని మొదటగా ఎంచుకున్నారు.

 
కాగా పవన్ కళ్యాణ్ ని వెండితెరపై చూసి మూడేళ్లు దాటిపోయింది. దీనితో ఆయన ఫ్యాన్స్ వకీల్ సాబ్ చిత్రం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. వకీల్ సాబ్ చిత్రం కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతలా ఎదుచూస్తున్నారో నిన్న విడుదలైన ట్రైలర్ కి దక్కిన ఆదరణే నిదర్శనం. వకీల్ సాబ్ ట్రైలర్ కొన్ని థియేటర్స్ లో ప్రత్యేకంగా ప్రదర్శించగా.. సదరు థియేటర్స్ వద్దకు పవన్ ఫ్యాన్స్ పోటెత్తారు. వైజాగ్ లో ఫ్యాన్స్ మధ్య తొక్కిసలాట జరగడంతో ఓ థియేటర్ గ్లాస్ డోర్ పగిలిపోయింది. 


పవన్ సినిమాకు భారీ ఎత్తున డిమాండ్ ఉన్న నేపథ్యంలో వకీల్ సాబ్ మూవీ టికెట్ ధరలు అమాంతంగా పెంచేశారట. వకీల్ సాబ్ సాధారణ షో టికెట్ ధర రూ. 200గా చేశారట. అయితే రెండు తెలుగు  రాష్ట్రాలలో ఏప్రిల్ 8 అర్థరాత్రి నుండి బెనిఫిట్ షోలు ప్రదర్శించాలని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారట. ఈ బెనిఫిట్ షో  టికెట్ ధర రూ. 1500 నుండి 2000 నిర్ణయించారని సమాచారం. ఇంత ధరకు కూడా వకీల్ సాబ్ టికెట్ ధర కొనడానికి ఫ్యాన్స్ సిద్ధంగా ఉండడం విశేషం. 

Follow Us:
Download App:
  • android
  • ios