టాలీవుడ్ కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి హీరోగా అడుగులు వేస్తోన్న సంగతి తెలిసిందే. సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమాతో కథానాయకుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అరుణ్ పవర్ దర్శకత్వం తెరకెక్కుతున్న చిత్రం వజ్రకవచధర గోవింద. 

సినిమాకు సంబందించిన ట్రైలర్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్ ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కామెడీతో పాటు థ్రిల్లర్ వంటి అంశాలను జోడించి ఓ మంచి మెస్సేజ్ కూడా సినిమాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సప్తగిరి డైలాగ్స్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. ‘ఇదే లాస్ట్ సిగరెట్, ఇదే లాస్ట్ పెగ్.. అన్న మగాళ్ల మాట, ఇదే లాస్ట్ షాపింగ్ అన్న ఆడవాళ్ల మాట.. జనాలు నమ్మినట్లు చరిత్రలోనే లేదు’’...అంటూ సప్తగిరి చెప్పిన డైలాగ్ హైలెట్ గా నిలుస్తోంది. 

నరేంద్ర - జివిఎన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా జూన్ 14న రిలీజ్ కానుంది.