'ఉప్పెన' హీరో నెక్ట్స్ ఖరారు, డైరక్టర్, బ్యానర్ డిటేల్స్

ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లో హాట్ స్టార్ గా మారారు వైష్ణ‌వ్ తేజ్. మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చినా.. మొద‌టి సినిమాతోనే తానేంటో నిరూపించుకుని సొంత ఐడింటిటీని నిలబెట్టుకున్నాడు ఈ హీరో. ఉప్పెన‌లో వైష్ణ‌వ్ అద‌ర‌గొట్టేయటంతో .. ఇప్పుడు ఈ హీరో కోసం అనేక మంది డైరక్టర్స్ క్యూలు కడుతున్నారు. అంతేనా మొద‌టి సినిమా విడుద‌ల అవ్వ‌క‌ముందే క్రిష్‌తో ఓ మూవీని కంప్లీట్ చేసిన వైష్ణ‌వ్.. ఇప్పుడు ఆ మూవీ విడుద‌ల కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపధ్యంలో వైష్ణవ్ తేజ తదుపరి చిత్రం ఎవరితో కమిటయ్యారనేది ఆసక్తికరమైన విషయంగా మారింది. 

Vaisshnav Tejs next for Nagarjuna Manam Entertainments jsp

ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లో హాట్ స్టార్ గా మారారు వైష్ణ‌వ్ తేజ్. మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చినా.. మొద‌టి సినిమాతోనే తానేంటో నిరూపించుకుని సొంత ఐడింటిటీని నిలబెట్టుకున్నాడు ఈ హీరో. ఉప్పెన‌లో వైష్ణ‌వ్ అద‌ర‌గొట్టేయటంతో .. ఇప్పుడు ఈ హీరో కోసం అనేక మంది డైరక్టర్స్ క్యూలు కడుతున్నారు. అంతేనా మొద‌టి సినిమా విడుద‌ల అవ్వ‌క‌ముందే క్రిష్‌తో ఓ మూవీని కంప్లీట్ చేసిన వైష్ణ‌వ్.. ఇప్పుడు ఆ మూవీ విడుద‌ల కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపధ్యంలో వైష్ణవ్ తేజ తదుపరి చిత్రం ఎవరితో కమిటయ్యారనేది ఆసక్తికరమైన విషయంగా మారింది. 

అందుతున్న సమాచారం మేరకు వైష్ణవ్ తేజ్ తన మూడో సినిమా అక్కినేని వారి బ్యానర్ లో చేయబోతున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న సినిమాలో వైష్ణవ్ నటించబోతున్నాడు. ఈ సినిమాకు నూతన దర్శకుడు పృథ్వి  డైరెక్టర్ గా వ్యవహరించనున్నాడు. అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ లో చదువుకున్న ఫృధ్వీ అనే కుర్రాడు చెప్పిన కథ నాగ్ కు నచ్చి వైష్ణవ్ తేజ్ కు చెప్పించినట్లు, వెంటనే ఓకే అయ్యినట్లు సమాచారం. జులై నుంచి షూటింగ్ కూడా మొదలు కానుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తివివరాలు అఫీషియల్ గా వెల్లడించనున్నారని తెలుస్తుంది.  

ఇక  బాక్సాఫీస్ వ‌ద్ద ఉప్పెన ఇప్ప‌టికే మంచి క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతూ దూసుకుపోతోంది.  ఈ మూవీని వివిధ భాష‌ల్లో రీమేక్ చేసేందుకు పోటీ మొద‌లైన‌ట్లు తెలుస్తోంది. త‌మిళంలో ద‌ల‌ప‌తి విజ‌య్ కుమారుడు జాసోన్ సంజ‌య్‌తో ఈ మూవీని రీమేక్ చేసేందుకు విజ‌య్ సేతుప‌తి ప్లాన్‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. అలాగే హిందీలోనూ ఉప్పెన రీమేక్ కాబోతున్న‌ట్లు టాక్.
 
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios