హీరో మెటీరియల్ అనిపించుకున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఫస్ట్ సినిమా ఉప్పెనతోనే అదరగొట్టేశాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న వైష్ణవ్.. ప్రస్తుతం రంగ రంగ వైభవంగా సినిమాతో రాబోతున్నాడు.
హీరో మెటీరియల్ అనిపించుకున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఫస్ట్ సినిమా ఉప్పెనతోనే అదరగొట్టేశాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న వైష్ణవ్.. ప్రస్తుతం రంగ రంగ వైభవంగా సినిమాతో రాబోతున్నాడు.
ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు వైష్ణవ్ తేజ్. మేగా హీరోగా ఇండస్ట్రీకి వచ్చినా.. తన టాలెంట్ తో పైకి ఎదుగుతున్నాడు మెగా మేనల్లుడు. యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకున్న వైష్ణవ్ తేజ్ మూడో సినిమాగా వస్తుంది రంగ రంగ వైభవంగా. గిరీశాయ దర్శకత్వంలో బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కేతిక శర్మ నటిస్తుంది.
ఫ్యామిలీ ఎమోషన్స్ ను కలుపుకుంటూ సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాకుదేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈసినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. తెలుసా తెలుసా ఎవరికోసం ఎవరు పుడతారో.. ఎవరికి ఎవరేమి అవుతారో' అంటూ సాగే పాటకు.. శ్రీమణి సాహిత్యాన్ని అందించగా.. పాటను స్టార్ సింగర్ శంకర్ మహదేవన్ పాడారు.

హీరో హీరోయిన్ల మధ్య హై స్కూల్ రోజుల నుంచే ప్రేమ అనే కథాంశంతో.. తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. మెడికల్ కాలేజ్ లో స్టూడెంట్స్ గా ఉన్నప్పటికీ వాళ్ల మధ్య అదే ప్రేమ కొనసాగుతున్నట్టుగా చూపించారు. విజయ్ బిన్ని కొరియోగ్రఫీ చేసిన ఈ సినిమాను ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
