Asianet News TeluguAsianet News Telugu

‘క్యాసినో ఆడి డబ్బులన్నీ పోగొట్టింది’.. గీతా మధూరిపై భర్త నందు షాకింగ్ కామెంట్స్

నటుడు నందు తన భార్య, సింగర్ గీతా మాధురి గురించి షాకింగ్ న్యూస్ ఒకటి చెప్పారు. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన సిరీస్ ప్రమోషన్స్ లో తన భార్య గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 

Vadhuvu Series Actor Nandu Says Singer Geetha Maduri Loss Money in Casino Game NSK
Author
First Published Dec 10, 2023, 5:00 PM IST

సింగర్ గీతా మాధురి (Singer Geetha Madhuri)  భర్త, నటుడు నందు (Actor Nandu)  ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో అలరిస్తున్నారు. గతేడాది ‘బొమ్మ బ్లాక్ బాస్టర్’ తో, అంతకు ముందు ‘సవారి’తో ప్రేక్షకులను అలరించారు. రీసెంట్ గా ‘వధువు’ (Vadhuvu) అనే వెబ్ సిరీస్ తో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ‘చిన్నారి పెళ్లి కూతురు’ ఫేమ్ అవికా గోర్, అలీ రెజా, నందు కలిసి నటించిన ఈ వెబ్ సిరీస్ తో ఓటీటీలో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మరింత వ్యూయర్ షిప్ ను సాధిస్తోంది. 

ఈ సందర్భంగా పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ వస్తున్నారు. తన సిరీస్ గురించి మరింతగా ఆసక్తి పుట్టిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నందు తన భార్య గీతా మాధురిపై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అప్పటికే వారిద్దరూ వీడిపోతున్నారంటూ వచ్చిన రూమర్లకు తోడు ఆయన చేసిన కామెంట్స్ షాకింగ్ గా ఉన్నాయి. గీతా మాధురి చేసిన పనికి డబ్బులన్నీ పోయాయని, ఓసారి తనకు వచ్చిన కోపంతో  డబ్బులు విసిరేసి వెళ్లిపోయానంటూ చెప్పుకొచ్చారు. 

విషయానికొస్తే.. నందు, గీత ఓసారి లండన్ కు వెళ్లినప్పుడు.. అక్కడ క్యాసినో గేమ్ ను గీత ఇష్టపడిందంట. వెంటనే నేర్చేసుకొని గేమ్ కూడా ఆడిందంట. కానీ అప్పుడు డబ్బులు పోయాయి. ఆ తర్వాత న్యూజిలాండ్, కాలిఫోర్నియాలోనూ ఆడి మనీ పోగొట్టుకుందంట. గేమ్ మీద ధ్యాస పెట్టి ఓసారి సమయం తెలియకుండా ఆడుతూనే ఉందంట... దాంటో తనకు విసుగొచ్చి డబ్బులు విసిరేసి అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయాడంట. తర్వాత తను కూడా వచ్చి సారీ చెప్పిందంట.. 

కానీ, క్యాసినో బయట తాము ఇద్దరు గొడవపడుతుంటే  పోలీసులు వచ్చి ఏంటని అడిగారంట... వాళ్లిద్దరూ భార్యభర్తలమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారంట. ఇక విడాకుల రూమర్స్ పైనా నందు స్పందించారు. తాము ఇద్దరం కలిసి ఫొటోలను షోస్ట్ చేయకపోవడం, కలిసి ఆయా ఫంక్షన్లకు రాకపోవడంతోనే ఇలాంటి రూమర్లు వచ్చాయన్నారు. కానీ వాటిలో ఎలాంటి నిజం లేదని ఖండించారు. ఇక నందు నెక్ట్స్ ‘అగ్లీ స్టోరీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. డెబ్యూ డైరెక్టర్ ప్రణవ స్వరూప్ డైరెక్ట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios