'మనసంతా నువ్వే', 'నేనున్నాను', 'ఆట' వంటి హిట్ చిత్రాలు తీసిన దర్శకుడు వి.ఎన్. ఆదిత్య తాజాగా మరో  కొత్త చిత్రంతో మన ముందుకు వస్తున్నారు. 

'మనసంతా నువ్వే', 'నేనున్నాను', 'ఆట' వంటి హిట్ చిత్రాలు తీసిన దర్శకుడు వి.ఎన్. ఆదిత్య తాజాగా మరో కొత్త చిత్రంతో మన ముందుకు వస్తున్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన "వాళ్ళిద్దరి మధ్య" చిత్రం ట్రైలర్ రిలీజైంది. విరాజ్ అశ్విన్, నేహా కృష్ణ ఇందులో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు . వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆహా ఓటిటిలో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ట్రైలర్ ..చాలా ఇంట్రస్టింగ్ ఉంది. ఫన్ తో సాగే రొమాంటిక్ కామెడీ అని అర్దమవుతోంది. ఓ లుక్కేయండి మీకూ నచ్చచ్చు.

YouTube video player

 దర్శకుడు వి.ఎన్ ఆదిత్య మాట్లాడుతూ, " సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ గారి మేనల్లుడు విరాజ్ అశ్విన్ ఈ కథకు హీరోగా కరెక్టుగా కుదిరాడు . మా చిత్రం కథలో హీరోయిన్ అమెరికా నుండి వస్తుంది. సహజత్వానికి దగ్గరగా ఉండేలా అమెరికా నుండే హీరోయిన్ ని పిలిపించాం. అక్కడ చదువుకుంటున్నా కూడా తెలుగు బాగా మాట్లాడగలిగే నేహా కృష్ణ మా కథ నచ్చి ఈ చిత్రంలో చేయడానికి ఒప్పుకుంది. మా చిత్రం ద్వారా ఆమెని తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం చేయడం ఆనందంగా ఉంది. ప్రముఖ కెమేరామ్యాన్ పి.జి. విందా దగ్గర అసోసియేట్ గా పనిచేసిన ఆర్.ఆర్. కోలంచి ఈ చిత్రం ద్వారా కెమెరామేన్ గా పరిచయం చేస్తున్నాం . ఇద్దరు ప్రతినాయకులలాంటి హీరో హీరోయిన్ మధ్య జరిగే ప్రేమ కథ ఇది. " అని తెలిపారు.

నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ, " నిర్మాతగా నాకు ఇదే తొలి సినిమా. కథ వినగానే ఇంప్రెస్ అయిపోయాను . వీఎన్ ఆదిత్య గారు చాలా ఎక్సలెంట్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టుగా ఉంటుందీ చిత్రం. " అని చెప్పారు

విరాజ్ అశ్విన్, నేహా కృష్ణ ,వెంకట్ సిద్ధారెడ్డి, బిందు చంద్రమౌళి, సాయి శ్రీనివాస్ వడ్లమాని, జయశ్రీ రాచకొండ, శ్రీకాంత్ అయ్యంగార్, నీహారికా రెడ్డి, ప్రశాంత్ సిద్ది , సుప్రజ, కృష్ణ కాంత్, అలీ, భార్గవ్, రామకృష్ణ తదితరులు. స్క్రీన్ ప్లే : సత్యానంద్, మాటలు: వెంకట్ డి .పతి , సంగీతం: మధు స్రవంతి, పాటలు: సిరాశ్రీ , కెమెరా: ఆర్.ఆర్.కోలంచి , ఆర్ట్: జెకే మూర్తి, ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల, లైన్ ప్రొడ్యూసర్: శ్రావణ్ నిడమానూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సూరపనేని కిషోర్, నిర్మాత: అర్జున్ దాస్యన్, కథ - దర్శకత్వం : వి.ఎన్. ఆదిత్య.