ఒక సినిమాకు పెట్టిన డబ్బులు రాకుంటే ఎంత బాధగా ఉంటుందో ఏ నిర్మాతకైనా ఈజీగా అర్ధమవుతుంది. అందుకే బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడటానికి ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. ఇక పెద్ద సినిమాలు రిలీజైతే కొందరు మర్యాదతో కూడా తప్పుకుంటారు. 

అదే తరహాలో ఇటీవల సాహో సినిమా కోసం రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ పోటీ నుంచి తప్పుకున్నాయి. అందుకు సాహో ప్రొడక్షన్ యూవీ క్రియేషన్స్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుపుతూ ఒక లేఖను విడుదల చేసింది. ప్రభాస్ సాహో సినిమాను మొదట ఆగస్ట్ 15న రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ గ్రాఫిక్స్ పనులు ఆలస్యం కావడంతో ఆగస్ట్ 30కి సినిమాను షిఫ్ట్ చేశారు. 

అయితే అంతకుముందే ఆగస్ట్ 30కి వస్తున్నట్లు నాని గ్యాంగ్ లీడర్ - సూర్య కాప్పాన్ (బందోబస్త్) నిర్మాతలు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నారు. ఇక సాహోతో పోటీ ఎందుకని ఒకరు వెనుకడుగు వేయగా యూవీ క్రియేషన్స్ ప్[పై అభిమానంతో మరొకరు డేట్ ను మార్చుకున్నారు. అందుకు వారికి యువీ క్రియేషన్స్ థ్యాంక్స్ చెప్పింది.