Asianet News TeluguAsianet News Telugu

#Adipurush కు జగన్ ఓకే చెప్తాడా..వివాదం అని ఆగుతాడా?

ప్రభాస్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే టీజర్స్‌తో పాటు ట్రైలర్‌ను విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. 

UV Creations started the groundwork for #Adipurush Ticket Price well in advance
Author
First Published Jun 9, 2023, 8:40 AM IST


భారీ బడ్జెట్ పెట్టి తీసిన సినిమాలకు భారీగా ఓపినింగ్స్ రావాలి,అలాగే ఫస్ట్ వీకెండ్ లోనే మాగ్జిమం రికవరీ కావాలి. అదే స్ట్రాటజీతో అందరూ ముందుకు వెళ్తారు. అయితే పెరిగిన రేట్లు, బిజినెస్ లతో రికవరీ అంటే అంతకు మించి అన్నట్లు టిక్కెట్ రేట్లు ఉంటేనే సాధ్యం. అయితే తెలంగాణా ఆ సమస్య లేదు . టిక్కెట్ రేట్లు పరంగా  పెంచుకునే అవకాసం ఉంది. కానీ ఆంధ్రాలో మాత్రం చాలా తక్కువ రేట్లు ఉన్నాయి. టిక్కెట్ రేట్లు పెంచే అవకాసం ఉండటం లేదు. ఇది పెద్ద సినిమాలకు అతి పెద్ద సమస్యగా మారింది. కానీ అప్పట్లో యువి క్రియేషన్స్ ప్రయత్నించటం .. పది రోజుల పాటు రాధేశ్యామ్ టికెట్ల ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రీమియం టికెట్ పై 25 రూపాయలు అదనంగా ధర పెంచుకునేందుకు అనుమతులిచ్చింది. అయితే అప్పుడు ఆ విషయం అంతటా పెద్ద వివాదంగా మారింది. 

ఇప్పుడు కూడా అదే విధంగా ఆదిపురుష్ చిత్రం కోసం టిక్కెట్ రేట్లు పెంచమని ఏపీ ప్రభుత్వాన్ని కలుస్తున్నట్లు సమాచారం. ఆల్రెడీ అదే బ్యానర్ లో వైయస్ జగన్ బయోపిక్ గా చెప్పబడుతున్న యాత్ర 2 చిత్రం నిర్మాణం జరగే అవకాసం ఉండటంతో టిక్కెట్లు పెంచవచ్చు అని ఓ వర్గం ప్రచారం చేస్తోంది. అయితే టిక్కెట్ రేట్లు కనుక ఆదిపురుష్ కు పెంచితే మళ్లీ వివాదాలు చుట్టుముట్టే అవకాసం ఉందని ప్రభుత్వం భావిస్తే మాత్రం కష్టం అంటున్నారు. అయితే యువి క్రియేషన్స్ మాత్రం గట్టిగానే ప్రయత్నిస్తోందని చెప్తున్నారు. ఎందుకంటే పీపుల్స్ మీడియాకు రైట్స్ అమ్మేటప్పుడు ఏపి ప్రభుత్వం ద్వారా టిక్కెట్ రేట్లు పెంచే వెసులు బాటు కలిగించేలా మాట్లాడతామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. 
 

ప్రభాస్ ఇన్నేళ్ల సినీ కెరియర్ చూసుకుంటే ఆయన నటించిన సినిమాల్లో అతి పెద్ద ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమా ఆదిపురుష్  అని చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాబట్టి ఓపెనింగ్స్ కూడా మామూలుగా ఉండవని, అదిరిపోవడం ఖాయమని అంటున్నారు. రిలీజ్ వీకెండ్ తర్వాత కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అదే సందడి నెలకొనాలి అంటే సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ షో నుండి పాజిటివ్ టాక్ రావాల్సి ఉంటుంది.  ప్రస్తుతం ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తో భారీ బిజినెస్ జరుగుతుంది. టాలీవుడ్ ఆగనిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు సుమారు రూ.185 కోట్లకు ఆది పురుష్ ప్రీ రిలీజ్ థియెట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు.


ఇక ఇప్పటికే ఫైనల్ అయిన బిజినెస్ డిటేల్స్ ఇక్కడ చూద్దాం...

నైజాం - 50Cr NRA , 60Cr అడ్వాన్స్
ఆంధ్రా - 50Cr NRA, 60Cr అడ్వాన్స్
సీడెడ్ - 17.50 Cr NRA, 20Cr అడ్వాన్స్

AP/TS - 117.50 Cr NRA, 140Cr అడ్వాన్స్

P&P - 3.50 Cr

ఈ క్రమంలో ఈ సినిమా బయ్యర్లకు బ్రేక్ ఈవెన్ రావాలంటే 121 కోట్లు షేర్ (జీఎస్టీతో )కలిపి రావాల్సి ఉంది.  

నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక రిలీజ్ కి ముందే ఫ్రీ రిలీజ్ బిజినెస్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న ఆదిపురుష్ మూవీ ప్రభాస్ కి ఎలాంటి సక్సెస్ను అందిస్తుందో చూడాలి. 

ఇక రామాయణం ఆధారంగా రాబోతున్న ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటించడంతో ఈ సినిమా ట్రైలర్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిన్న తిరుపతిలో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. ఇక ఆ ఈవెంట్ కి లక్షల్లో ప్రభాస్ అభిమానులు వచ్చారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios