Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్  ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ వచ్చేంది. పవన్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక అప్డేట్‌తో ఫ్యాన్స్‌కి ప్రీ-లుక్ ఇచ్చేలా ప్లాన్ చేశారు. 

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా, రాశీ ఖన్నా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై మూవీ మేకర్స్ భారీ బజ్ క్రియేట్ చేస్తున్నారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో నిరీక్షిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పవన్ కల్యాణ్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా తెలుగు రాష్ట్రాల అభిమానులకు ఫుల్ మీల్స్ అనగా ప్రత్యేక అప్‌డేట్స్ ప్రకటించారు. 

View post on Instagram

పవర్ స్టార్ బర్త్ డే ట్రీట్ గా మేకర్స్ ప్రత్యేక ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో వింటేజ్ పవన్ లుక్ స్పెషల్ గా కనిపిస్తోంది. ఇటీవల పవన్ ఒక సాంగ్ పూర్తి చేసిన కాస్ట్యూమ్‌లో ఆయన ఫోటోలను మేకర్స్ ప్రదర్శించారు. అదే సమయంలో రేపు సాయంత్రం 4:45 నిమిషాలకు అసలు ఫుల్ మీల్స్ రిలీజ్ కానున్నదంటూ మేకర్స్ తెలిపారు. ఇప్పుడీ ప్ర‌క‌ట‌న సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. ప్రీ-లుక్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.