మన విజయాన్ని వాళ్ల విజయంగా.. ఆస్కార్ విన్నింగ్ ‘నాటు నాటు’కు యూఎస్ టీనేజ్ డాన్స్.. వైరల్ వీడియో..
ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు దక్కించుకున్న ‘నాటు నాటు’కు యూఎస్ లో అంతకంతకూ క్రేజ్ పెరగుతూనే ఉంది. తాజాగా యూఎస్ అమ్మాయి ఊరమాస్ స్టెప్పులతో అదరగొట్టింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’. మరో మూడు రోజులైతే ఈ చిత్రం విడుదలై ఏడాది పూర్తి కావస్తుంది. సంవత్సర కాలంగా ఈ చిత్రం ఏదోరకంగా ట్రెండింగ్ లోనే ఉంది. ముఖ్యంగా ఆస్కార్ విన్నింగ్ సాంగ్ ‘నాటు నాటు’ దుమ్ములేపుతూనే ఉంది.మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ఈసాంగ్ ను ఓన్ చేసుకున్నారు. నాటు నాటుకు ఇంకా స్టెప్పులేస్తూనే ఉన్నారు.
ఆస్కార్ గెలుచుకున్న తర్వాత యూఎస్ లో ‘నాటు నాటు’ సాంగ్ క్రేజ్ మరింతగా పెరిగింది. అక్కడి యూత్ సాంగ్ కు రీల్స్ చేస్తూ వస్తున్నారు. మూడు రోజుల కింద యూఎస్ కు చెందిన ఓ టీనేజ్ (అమ్మాయి) Naatu Naatuకు డాన్స్ చేయడం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. బాస్కెట్ బాట్ లో కోర్టులో నాటు నాటు తరహా కాస్ట్యూమ్స్ లోనే హుక్ స్టెప్ తో అదరగొట్టింది. తను ఇన్ స్టాలో షేర్ చేసిన ఆ వీడియోకు ఏకంగా 4 మిలియన్ల వరకు వ్యూస్ దక్కడం విశేషం. మరోవైపు 3.5 లక్షలకు పైగా లైక్స్ అందుకుంది. ఏడాదిగా సాంగ్ ట్రెండింగ్ లోనే ఉండటం.. ఆస్కార్ విన్నింగ్ తర్వాత భారతీయులతో పోటీపడుతూ.. విదేశీయులు ఈ సాంగ్ ను నేటికీ ట్రెండింగ్ లోనే ఉంచుతున్నారు.
ఆమె పంచుకున్న వీడియోకు పలువురు యూఎస్ కు చెందిన నెటిజన్లు ఆసక్తికరంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈసారి ఆస్కార్ వేడుకల్లో గుర్తుండిపోయేది ఏదైనా ఉందంటే అది ‘నాటు నాటు’ సాంగ్ అని తెలుపుతున్నారు. అందుకు తెలంగాణ యూజర్ ఒకరు ‘మా విజయాన్ని కూడా మీ విజయంగా భావించడం సంతోషంగా ఉందంటూ’ కామెంట్లు పెడుతున్నారు. ఇలా ప్రతిఒక్కరూ నాటు నాటుపై ప్రేమ చూపిస్తూనే ఉన్నారు.
రీసెంట్ గా ‘నాటు నాటు’కు ఇండియన్ ఫేమస్ క్రికెటర్ విరాట్ కోహ్లీ డాన్స్ చేసిన విషయం తెలిసిందే. భారతదేశంలోని జర్మన్ ఎంబసీ డాక్టర్ ఫిలిప్ అకర్‌మాన్, అంతకు ముందు ఇండియాలోని సౌత్ కొరియన్ ఎంబసీ డాన్స్ చేసి ఆకట్టుకుంది. దీంతో ‘నాటు నాటు’ ఏరేంజ్ లో ప్రపంచ వ్యాప్తంగా నాటుకుపోయిందో అర్థమవుతోంది. మార్చి 13న అమెరికాలోని లాస్ ఎంజెల్స్ లో గల డాల్బీ థియేటర్ లో 95వ ఆస్కార్ వేడుకలు అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఎంఎం కీరవాణి, చంద్రబోస్ అవార్డును స్వీకరించి.. ఎమోషనల్ వర్డ్స్ తో వేదికపై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.