నటి ఊర్మిళా 1990లలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో రామ్ గోపాల్ వర్మ సినిమాల ద్వారా బాగా ఫేమస్ అయింది. బాలీవుడ్ లో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.

అయితే ఈ మధ్య కాలంలో మాత్రం అమ్మడు సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. కానీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి తరచూ చర్చల్లోకి వస్తుంది. 42 ఏళ్ల వయసులో ఈ భామ తనకన్నా తొమ్మిదేళ్లు చిన్నవాడైనమోడల్, బిజినెస్ మెన్ మొహసిన్ మీర్ అక్తర్ ని వివాహం చేసుకొంది. 

రెండేళ్ల క్రితమే వీరి పెళ్లి జరిగింది. కానీ విషయాన్ని మాత్రం చాలా సీక్రెట్ గా ఉంచారు. ఊర్మిళ, మొహసిన్ ల పరిచయం కామన్ ఫ్రెండ్ మనీష్ మల్హోత్రా ద్వారా జరిగింది. మొహసిన్ హీరోగా సినిమాలు చేశాడు. 2007లో మిస్టర్ ఇండియా పోటీల్లో రెండవ రన్నరప్ గా నిలిచాడు.

గతంలో ఊర్మిళ తమ వివాహ విషయాన్ని గోప్యంగా ఉంచడంపై మాట్లాడుతూ.. 'మేము మా వివాహాన్ని కేవలం బంధువులు, స్నేహితుల మధ్యనే చేసుకోవాలనుకున్నాం. అలానే హడావిడి లేకుండా కొద్దిమంది మధ్యలోనే వివాహం చేసుకున్నామని' తెలిపింది.