ఉప్పెన బుచ్చిబాబు సుకుమార్ తో చర్చల్లో పాల్గొన్న ఫోటోలు వైరల్ కాగా, పుష్ప స్టోరీ సిట్టింగ్స్ లో ఆయన పాల్గొంటున్నారని అందరూ భావించారు. దానికి బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చారు.
సుకుమార్-అల్లు అర్జున్(Allu Arjun) హ్యాట్రిక్ మూవీ పుష్ప(Pushpa) భారీ విజయం సాధించింది. పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటింది. ముఖ్యంగా హిందీ ఈ మూవీ వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో పుష్ప 2 భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. బడ్జెట్ మూడింతలు చేసిన చిత్ర యూనిట్ స్క్రిప్ట్ లో సైతం మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ క్రమంలో సుకుమార్, బుచ్చిబాబు స్టోరీ సిట్టింగ్స్ లో కూర్చోవడం చర్చకు దారితీసింది. పుష్ప 2 స్క్రిప్ట్ పై బుచ్చిబాబు కూడా పని చేస్తున్నాడని కథనాలు వెలువడ్డాయి.
వరుస కథనాల నేపద్యంలో బుచ్చిబాబు(Buchi babu) స్పందించారు. సోషల్ మీడియా వేదికగా అసలు విషయం బయటపెట్టారు. తన ట్వీట్ లో బుచ్చిబాబు.... నా నెక్స్ట్ మూవీ కథలో మా గురువు సుకుమార్ సహాయం చేస్తున్నారు. అంటే కానీ ఆయన సినిమా కథల డిస్కషన్స్ లో పాల్గొనేంత అర్హత, సత్తా నాకు లేదు.. అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం బుచ్చిబాబు ట్వీట్ వైరల్ గా మారింది.
ఇక పుష్ప 2 షూటింగ్ ఆగస్టు లో ప్రారంభం కానుంది. శ్రావణమాసం ముగిసిన వెంటనే పూజ నిర్వహించి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారట. 2023లో పుష్ప 2 విడుదల కానుంది. మరోవైపు బుచ్చిబాబు చాలా కాలంగా ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు ఓ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా సిద్ధం చేస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి. దీనికి పెద్ది అనే టైటిల్ కూడా నిర్ణయించారట. మరి బుచ్చిబాబు చెప్పిన ఆ స్టోరీ డిష్కసన్ ఎన్టీఆర్ మూవీ గురించేనా నే ఆసక్తి కొనసాగుతుంది...
