Asianet News TeluguAsianet News Telugu

Upendra Gadi Adda Review : ‘ఉపేంద్ర గాడి అడ్డ’ మూవీ రివ్యూ.!

యువ హీరో కంచర్ల ఉపేంద్ర నటించిన ‘ఉపేంద్ర గాడి అడ్డా’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ జోనర్ లో వచ్చిన ఈ చిత్రం ఆడియెన్స్ ను ఎలా అలరించిందనే విషయాలు తెలుసుకుందాం. రివ్యూలో ఈ సినిమా కథ, పెర్ఫామెన్స్ వంటి విషయాలను తెలుసుకుందాం. 
 

Upendra Gadi Adda Movie Review NSK
Author
First Published Dec 1, 2023, 6:19 PM IST

యువ హీరో కంచర్ల ఉపేంద్ర (Upendra Kancharla) నటించిన చిత్రమే ‘ఉపేంద్ర గాడి అడ్డా’ (Upendra Gadi Adda).   మాస్ ఎంటర్టైనర్ గా ఈ రోజు (డిసెంబర్ 1న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో హీరోయిన్ గా సావిత్రి కృష్ణ నటించారు. ఆర్యన్ సుభాన్ ఎస్.కె.దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎస్.ఎస్.ఎల్.ఎస్. (SSLS) క్రియేషన్స్ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మించారు. మరి ఈ చిత్రం ఏమాత్రం ఆకట్టుకుందో మూవీ రివ్యూలో చూద్దాం...

కథ: 

బంజారాహిల్స్ లోని ఓ బస్తీ కుర్రాడు ఉపేంద్ర (కంచర్ల ఉపేంద్ర) డిగ్రీ వరకూ చదువుకున్నాడు. చదువకున్నా ఈజీగా మనీ సంపాధించి సెటిల్ అయిపోవాలనునుకునే మనస్థత్వం ఉన్న కుర్రాడు అతను. అందుకోసం ఓ రిచ్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అప్పులు చేస్తాడు. పబ్ ల చుట్టూ తిరుగుతుంటాడు. ఈ క్రమంలో సావిత్రి(సావిత్రి కృష్ణ) పరిచయం అవుతుంది. ఆమె గొప్పింటి అమ్మాయి అనుకుని... తాను కూడా రిచ్ కిడ్ అని చెప్పి ఆమెతో ప్రేమ పేరుతో పరిచయం పెంచుకుంటారు. ఇద్దరూ ప్రేమలో పడతారు. ఓరోజు ఆమెకు తనగురించి నిజం చెబుతాడు. ఆ తర్వాత వారిద్దిరి రిలేషన్ ఎలా ఉండింది? సావిత్రితో లవ్ ను కొనసాగించిందా? అసలు సావిత్రి ఎవరు? చివరికి ఏమైంది? అనేది మిగితా కథ..

సమీక్ష : 

మాస్ ఎంటర్టైనర్ లకు యూత్ లో ఎప్పుడూ మంచి ఆదరణే ఉంటుంది. అందుకే కొత్తగా వెండితెరకు పరిచయం అయ్యే యువ హీరోలు ఈ జోనర్ ను ఎంచుకుని సినిమాలు చేస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే యువతను ఆకట్టుకునే మాస్ ఎంటర్టైన్ గా ‘ఉపేంద్ర గాడి అడ్డా’ను తెరకెక్కించారు. ఈ చిత్రంలో కేవలం మాస్ ఎలెమెంట్స్, లవ్ మాత్రమే కాకుండా.. మంచి మెసేజ్ ను కూడా అందించే ప్రయత్నం చేశారు. యూత్, వారి తల్లిదండ్రులకు దర్శకుడు ఓ కొత్త విషయాన్ని చెప్పేందుకు ప్రయత్నించినట్టు అర్థమవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావితం సొసైటీపై ఎంత ఉందో.. ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయో చెప్పేందుకు కృషి చేశారు దర్శకుడు. ముఖ్యంగా అమ్మాయిలు సోషల్ మీడియా ప్రభావంతో తమ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారనే బాగా చూపించారు. కానీ కొన్ని సన్నివేశాలను ఇంకాస్తా ఎఫెక్టివ్ గా చూపిస్తే బాగుండనిపించింది. మంచి కథను, అందులోనూ సందేశంతో కూడిన సన్నివేశాలను ఆడియెన్స్ కు ఓ డ్రగ్ లాగా ఎక్కించాలంటే చాలా శ్రమించాల్సి  ఉంటుంది. ఆ విషయంలో కాస్తా గాడి తప్పారు. మొదటి అర్థం సరదాగా గడిచిపోయింది. సంగీతం, డైలాగ్స్ పర్లేదనిపించేలా ఉన్నాయి. 

అలాగే సోషల్ మీడియాలో అబ్బాయిలు... అమ్మాయిలను ఎలా మోసం చేసి... చెడు మార్గాన్ని ఎంచుకుంటున్నారు? దాని వల్ల వారు చేసే క్రైం ని ద్వితీయార్థంలో దర్శకుడు చక్కగా చూపించారు. నేటి సమాజంలో సెల్ ఫోన్ ప్రభావం పిల్లల జీవితాలను ఎంత ప్రమాదంలోకి నెడుతోందనేదాన్ని చూపించారు వారి తల్లిదండ్రులు ఎలా అప్రమత్తంగా ఉండాలనే దాన్ని ఉమెన్ ట్రాఫికింగ్ ద్వారా చూపించడం బాగుంది. ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్లతో సరదా సన్నివేశాలను చూపించి... సెకెండాఫ్ లో ఓ మంచి మెసేజ్ ఇచ్చే సినిమాగా ‘ఉపేంద్ర గాడి అడ్డా’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇదే కథకు బెస్ట్ కాస్ట్ ఉంటే ఫలితం వేరేలా ఉండేదని చెప్పొచ్చు.. 

నటీనటుల పెర్ఫామెన్స్ : 

కంచర్ల ఉపేంద్ర కొత్త కుర్రాడైనా చాలా చక్కగా నటించారు. డ్యాన్స్, ఫైట్స్ బాగా చేసి... మాస్ ను ఆకట్టుకున్నాడు. బస్తీ కుర్రాడిగా.. రిచ్ కిడ్ గానూ రెండు వేరియేషన్స్ లో బాగా నటించాడు. ఉపేంద్రకు జోడీగా నటించిన సావిత్రి కృష్ణ కూడా బాగా చేసింది. బాధ్యత గల అమ్మాయి పాత్రలో మెప్పించింది. హీరో చుట్టూ స్నేహితులుగా ఉండే జబర్దస్థ్ బ్యాచ్ కూడా బాగా నవ్వించారు. జబర్దస్థ్ కమెడియన్ అప్పారావు కాసేపు ఉన్నా నవ్వులు పూయించారు. బలగం మురళీధర్ గౌడ్, నటి ప్రభావతి హీరో తల్లిదండ్రులుగా ఆకట్టుకున్నారు. కిరీటి దామరాజు పాత్ర పర్వాలేదు. హీరోయిన్ తల్లిదండ్రులుగా సంధ్య జనక్, బస్ స్టాప్ కోటేశ్వరరావు తమ పాత్రలకు న్యాయం చేశారు. 

టెక్నీషియన్లు : 

అలాగే దర్శకుడు రాసుకున్న కథ... కథనం బాగుంది. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఓ కొత్త హీరోను ఎన్ని యాంగిల్స్ లో చూపించాలో అన్ని రకాలుగానూ హీరో పాత్రను తీర్చిదిద్దారు. స్కీన్ ప్లే ఇంకాస్తా మెరుగ్గా ఉంటే బాగుండేది. సంగీతం మాస్ ను ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. హీరో, హీరోయిన్లను బాగా చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండాల్సింది. నిర్మాత కంచర్ల అచ్యుతరావు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను ఎంతో ఉన్నతంగా నిర్మించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios