మెగా కోడలు ఉపాసన తన మామయ్య  గారైన చిరంజీవి పుట్టినరోజు సంధర్భంగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. అందరకీ ఆయన మెగాస్టార్ కావచ్చు నాకు మాత్రం మామయ్య అంటూ ఆయనపై ఉన్న ప్రేమను, బరువైన పదాల రూపంలో పొందుపరిచింది. ఉపాసన తన ట్వీట్ లో '  విశ్వాస పాత్రుడు, నిరంతర అభ్యాసకుడు, ఔదార్యం ఉన్న వ్యక్తి, కఠినమైన సమయాల్లో విశ్వసించగల బలం - ప్రపంచం అంతా వీరిని మెగాస్టార్ అని పిస్తుంది. కానీ నాకు మాత్రం మామయ్య. హ్యాపీ బర్త్ డే మామయ్య. మీ సంతోషాలు కొనసాగుతాయి' అని చెప్పడం జరిగింది. 

దేశంలోనే అతిపెద్ద హాస్పిటల్స్ చైన్స్ లో ఒకటైన అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్ పర్సన్ అయిన ఉపాసన కొణిదెల మెగా కోడలిగా మంచి పేరుతెచ్చుకున్నారు. యంగ్ ఎంట్రప్రెన్యూర్ అయిన ఉపాసన కుటుంబం పట్ల అత్యంత ప్రేమ కనబరుస్తుంది. అత్తమామలను గౌరవించడంతో పాటు, భర్త చరణ్ కి బెస్ట్ లైఫ్ పార్ట్నర్ గా ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఉపాసన భార్యగా దొరకడం నా అదృష్టం అని చరణ్ చెప్పడం విశేషం. 

ఉపాసన బి పాజిటివ్ పేరుతో ఓ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ నడుపుతున్నారు. ఈ మ్యాగజైన్ కవర్ పేజీపై చిరంజీవి ఫొటోతో ఓ ఎడిషన్ విడుదల చేశారు. అలాగే రామ్ చరణ్ కవర్ పేజీతో కూడా మరో ఎడిషన్ రావడం జరిగింది. బాలీవుడ్ ప్రముఖులైన సల్మాన్, కత్రినా వంటి స్టార్స్ సైతం బి పాజిటివ్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు.