మెగా కోడలు ఉపాసన కొణిదెల తన డెలివరీకి సంబంధించిన అప్ డేట్ ఇచ్చింది. అమెరికాలో తన తొలి బిడ్డకి జన్మనివ్వబోతుందనే రూమర్స్ వినిపించిన నేపథ్యంలో క్లారిటీ ఇచ్చింది ఉపాసన.
మెగా కోడలు ఉపాసన ప్రస్తుతం గర్బవతిగా ఉన్నారు. ఆమె గత డిసెంబర్‌లో తన ప్రెగ్నెన్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత రామ్‌చరణ్, ఉపాసన తమ జీవితంలోకి వారసులను ఆహ్వానించబోతున్నట్టు వెల్లడించారు. తాజాగా డెలివరీ ఇండియాలో చేసుకుంటానని, తన తొలి బిడ్డకి భారత్‌లోనే జన్మనిస్తానని వెల్లడించింది ఉపాసన. అంతర్జాతీయ స్టాండర్స్ వైద్యులు ఇప్పుడు అపోలో ఆసుపత్రిలోనేఉన్నారని, మరో గైనకాలజిస్ట్ కూడా కాబోతున్నారని తెలిపింది ఉపాసన. ఈ మేరకు ఆమె ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని పంచుకుంది.
ఇందులో ఉపాసన చెబుతూ, మా స్వదేశం ఇండియాలోనే మా మొదటి బిడ్డని ప్రసవించుతున్నందుకు నేను చాలా థ్రిల్ ఫీలవుతున్నా. ప్రపంచ స్థాయి వైద్య బృందం(ఓబీ, గైనకాలజిస్ట్) అపోలో ఆసుపత్రిలోనే ఉంది. వీరిలో డాక్టర్ సుమనా మనోహర్, డాక్టర్ రూమా సిన్హా, ఇప్పుడు కొత్తగా గుడ్ మార్నింగ్ అమెరికాషో నుంచి డాక్టర్ జెన్నిఫర్ ఆష్టన్ అందుబాటులోకి రాబోతున్నారు. ఈ ప్రయాణం మాకు జీవితంలో ఈ కొత్త దశ కోసం ఎంతో నిరీక్షనతో ఎదురుచూస్తున్నాం` అని తెలిపింది ఉపాసన.
దీనికి అమెరికా డాక్టర్ జెన్నిఫర్ సైతం రియాక్ట్ అయ్యింది. అందుకు తన అంగీకారం తెలిపింది. `అందుకు తాను ఇష్టపడతాను` అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్విట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల రామ్‌చరణ్ అమెరికాలోని `గుడ్ మార్నింగ్ అమెరికా` షోలో పాల్గొన్నారు. ఆ తర్వాతనుంచి చరణ్-ఉపాసన అమెరికాలోనే తమ మొదటి బిడ్డని కనబోతున్నారనే రూమర్లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి క్లారిటీ ఇచ్చింది ఉపాసన. అలాగే తన డెలివరీ అప్‌డేట్‌ని కూడా ఇచ్చింది. హైదరాబాద్‌లోనే అపోలో ఆసుపత్రిలోనే ఆమె డెలివరీ కానున్నట్టు వెల్లడించింది.
ప్రస్తుతం రామ్‌చరణ్ అమెరికాలో ఉన్నారు. ఆయన హీరోగా నటించిన `ఆర్‌ఆర్‌ఆర్` మూవీ ఆస్కార్ బరిలో ఉంది. ఇందులో `నాటు నాటు` సాంగ్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌కి నామినేట్ అయిన విషయంతెలిసిందే. మార్చి 12న ఆస్కార్ అవార్డులను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ తమ సినిమాని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు జక్కన్న టీమ్. రామ్‌చరణ్‌తోపాటు కీరవాణి, ఇతర బృందం అమెరికాలోనే ఉన్నారు. తమ వంతు ప్రమోషన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల `హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్` అవార్డులు `ఆర్‌ఆర్‌ఆర్`కి వరించిన విషయం తెలిసిందే. నాలుగు విభాగాల్లో అవార్డులు రాగా, రామ్‌చరణ్‌కి స్పాట్‌లైట్ పురస్కారం వరించింది. ఎన్టీఆర్‌కి కూడా ఇవ్వనున్నారు.
