లాస్ ఏంజిల్స్ లో విలాసవంతమైన బంగ్లాని అద్దెకి తీసుకున్న ఉపాసన.. ఎందుకంటే ?
మెగా పవర్ స్టార్ రాంచరణ్ గ్లోబల్ స్టార్ గా ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు సాధించడంతో రాజమౌళి, కీరవాణి, రాంచరణ్, ఎన్టీఆర్ పేర్లు ప్రపంచ దేశాల్లో మారుమోగుతున్నాయి.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ గ్లోబల్ స్టార్ గా ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు సాధించడంతో రాజమౌళి, కీరవాణి, రాంచరణ్, ఎన్టీఆర్ పేర్లు ప్రపంచ దేశాల్లో మారుమోగుతున్నాయి. మార్చి 13న జరిగిన 95వ అకాడమీ అవార్డ్స్ వేడుకలో నాటు నాటు సాంగ్ దేశం గర్వించే విధంగా ఆస్కార్ కైవసం చేసుకుంది.
రియానా, లేడీ గాగా లాంటి హాలీవుడ్ దిగ్గజాల పాటలని అధికమిస్తూ నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలిచింది. దీనితో చిత్ర యూనిట్ మొత్తం సంబరాల్లో మునిగిపోయారు. ఆస్కార్ ప్రమోషన్స్ కోసం రాజమౌళి అండ్ టీం కొన్ని నెలలుగా యుఎస్ లో ప్రమోషన్స్ నిర్వహిస్తూ ఎంతో కష్టపడ్డారు. పలుమార్లు రాంచరణ్ ఎన్టీఆర్ యుఎస్, జపాన్ లాంటి దేశాల్లో పర్యటించారు.
గత కొన్ని వారాలుగా చరణ్ యుఎస్ లోనే ఉంటూ ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. యుఎస్ లో రాంచరణ్ చాలా లాంగ్ స్టే చేయాల్సి ఉండడంతో తన భర్త కోసం ఉపాసన ఆశ్చర్యపోయే పని చేసిందట. లాస్ ఏంజిల్స్ లో ఉపాసన విలాసవంతమైన బంగ్లాని కొన్ని నెలలపాటు అద్దెకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ.. ఈ ప్రచారం మాత్రం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
ఉపాసన కూడా ఆస్కార్ సెలెబ్రేషన్స్ కి చాలా రోజుల ముందే యుఎస్ వెళ్ళింది. రాంచరణ్, ఉపాసన ఇద్దరూ ఆ బంగ్లాలో స్టే చేశారట. వీరికి సహాయకులుగా ముగ్గురు సిబ్బందిని ఇండియా నుంచి హైర్ చేసుకుని మరీ వెళ్లారట. ప్రస్తుతం ఉపాసన గర్భవతి కావడంతో హెల్త్ కేరింగ్ కోసం కూడా అయి ఉండొచ్చు.
ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ గెలిచిన తర్వాత చిత్ర యూనిట్ మొత్తం ఆ ఇంట్లోనే పార్టీ జరుపుకున్నట్లు తెలుస్తోంది. రాంచరణ్, ఉపాసన చిన్న పెట్టెలో దేవుడి ప్రతిమలకు పూజ చేస్తున్న దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి.