మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' చిత్రం భారీ అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఏపీ, తెలంగాణా రెండు రాష్ట్రాల్లో 'సైరా' హడావిడి మాములుగా లేదు. ఎక్కడ చూసిన థియేటర్లు మొత్తం సందడితో వెలిగిపోతున్నాయి. 'సైరా', 'సైరా' అంటూ అభిమానులు అరిచే అరుపులు మారు మోగుతున్నాయి.

దసరా సీజన్, గాంధీ జయంతి సెలవు కావడంతో జనాలంతా థియేటర్లకు క్యూ కడుతున్నారు. గత రాత్రి నుండి థియేటర్ల వద్ద మెగాస్టార్ అభిమానులు హంగామా చేస్తున్నారు. భారీ కటౌట్లు, పూల మాలలు కడుతూ భారీగా స్వాగతం చెప్పారు.ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని మరింత పెంచేలా మెగాకోడలు ఉపాసన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

తన మామ నటించిన సినిమా, పైగా తన భర్త నిర్మాత అలాంటప్పుడు ఉపాసన మాట్లాడుకుందా ఉంటుందా మరి..? అందుకే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.  

విజయవాడలో మెగా ఫ్యాన్స్ చేస్తున్న హంగామా వీడియోను షేర్ చేసిన ఉపాసన.. 'లవ్ ది బెజవాడ బీట్' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. భీమవరం, హైదరాబాద్‌లతో పాటు విదేశాల్లో మెగా అభిమానుల సందడి షేర్ చేశారు ఉపాసన.