బాలకృష్ణ కూతురు, నారా లోకేష్ భార్య బ్రాహ్మణి, మెగాకోడలు ఉపాసన కలిసి ఈజిప్ట్ లో సందడి చేస్తున్నారు.దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈజిప్ట్ లో ప్రఖ్యాతి గాంచిన పిరమిడ్  గిజా వద్ద తమ స్నేహితులతో కలిసి తీసుకున్న ఫోటోలను ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. గురు, శుక్ర, శనివారం ఈజిప్ట్ లో తిరిగి చరిత్రకు సంబంధించిన విషయాలు నేర్చుకున్నాం, చర్చించుకున్నాం.

ఈ ట్రిప్ ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ఉపాసన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఉపాసన, బ్రాహ్మణిలు మంచి స్నేహితులు.. ఇప్పుడు ఇద్దరూ కలిసి ట్రిప్ కి వెళ్లడం, దానికి సంబంధించిన ఫోటోలు షేర్ చేసుకోవడం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది.