మెగా కోడలు ఉపాసన కొణిదెల జూన్ 20న పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో ఫ్యామిలీ మొత్తం సంబరాల్లో ఉంది. పెళ్ళైన పదేళ్ల తర్వాత ఉపాసన, రాంచరణ్ తల్లిదండ్రులుగా కొత్త ప్రయాణం మొదలు పెట్టారు.

మెగా కోడలు ఉపాసన కొణిదెల జూన్ 20న పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో ఫ్యామిలీ మొత్తం సంబరాల్లో ఉంది. పెళ్ళైన పదేళ్ల తర్వాత ఉపాసన, రాంచరణ్ తల్లిదండ్రులుగా కొత్త ప్రయాణం మొదలు పెట్టారు. ఇటీవలే పాపకి కుటుంబ సభ్యులు క్లీన్ కారా అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. లలిత సహస్ర నామంలోని సంస్కృత పదాల ఆధారంగా పాపకి ఈ పేరు పెట్టినట్లు స్వయంగా చిరంజీవి సోషల్ మీడియాలో వివరించారు. 

ఇదిలా ఉండగా ఉపాసన లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి బర్త్ డే విషెస్ చెబుతూ వెరైటీ పోస్ట్ షేర్ చేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల టెన్నిస్ మెగా టోర్నీ వింబుల్డన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీనితో వింబుల్డన్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఇద్దరు టెన్నిస్ ఆటగాళ్లు నాటు నాటు స్టెప్పువేస్తున్న ఫోటో క్రియేట్ చేసి పోస్ట్ చేశారు. దీనితో ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ షేర్ చేసింది. 

ఉపాసన ఇదే పిక్ ని ఇన్స్టా లో షేర్ చేస్తూ కీరవాణికి బర్త్ డే విషెస్ తెలిపింది. హ్యాపీ బర్త్ డే బాబాయ్ అని పోస్ట్ చేసింది. నాటు నాటు సాంగ్ తో కీరవాణి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందడమే కాదు. ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ లాంటి ప్రఖ్యాత అవార్డులని సైతం అందుకున్నారు. దీనితో కీరవాణి గుర్తింపుకు ఖ్యాతికి తగ్గట్లుగా మెగా కోడలు ఇలా అంతర్జాతీయ స్థాయిలో వైరల్ అవుతున్న పిక్ తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. 

ఉపాసనకి పాప జన్మించినప్పుడు.. కీరవాణి తనయుడు కాల భైరవ స్వయంగా కంపోజ్ చేసిన మ్యూజిక్ బైట్ ని గిఫ్ట్ గా పంపారు. ఆ మ్యూజిక్ బైట్ ని చరణ్ సోషల్ మీడియాలో పంచుకున్న సంగతి తెలిసిందే. కీరవాణి నాటు నాటు సాంగ్ కి అదిరిపోయే ట్యూన్ ఇవ్వగా.. చంద్రబోస్ హుషారెత్తించే లిరిక్స్ అందించారు. ఇక చరణ్, ఎన్టీఆర్ ప్రపంచం మొత్తం ఊగిపోయేలా డ్యాన్స్ చేసి అలరించారు.